కబాలి రిలీజ్ కు మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ | Madras High Court clearance for Kabali release

Madras high court clearance for kabali release

kabali release, Madras High Court clearance for Kabali, linga distributors madras HC, Madras high court Kabali

Madras High Court clearance for Kabali release.

ఫ్లాష్: కబాలి రిలీజ్ కి లైన్ క్లియర్

Posted: 07/21/2016 01:20 PM IST
Madras high court clearance for kabali release

తలైవా అభిమానులకు స్వీట్ న్యూస్. కబాలిని ఆపాలని ప్రయత్నించిన పంపిణీదారులకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. చిత్ర విడుదలపై స్టే ఇవ్వలేమని తీర్పించింది. ఇప్పటికే చిత్ర విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ సమయంలో సినిమాను ఆపటం సరికాదని కోర్టు వారికి సూచించింది.

గతంలో రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలను చూపింది. దీనిపై సుక్ర ఫిలిమ్స్ భాగస్వామి ఆర్. మహాప్రభు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ‘‘2014లో లింగా సినిమా వల్ల నేను భారీగా నష్టపోయాను. నాకు నష్టపరిహారం చెల్లిస్తామని ఆ సినిమా నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, హీరో రజినీకాంత్ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే తనకు ఇంకా రూ. 89 లక్షలు చెంచాల్సి ఉంది. నాకు రావాల్సిన మొత్తం చెల్లించాకే ‘కబాలి’ సినిమాను రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలి’’ అని మద్రాసు హైకోర్టును మహాప్రభు కోరారు.

మహాప్రభు పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ ఎం. ఎం. సుంద్రేష్.. తమిళ సినిమా నిర్మాత మండలి, హీరో రజినీకాంత్‌తో పాటు దీనికి సంబంధించిన మరికొందరికి కూడా నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చివరికి చిత్ర విడుదలను అడ్డుకోవటం సరికాదని, సమస్యను బయటే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. దీంతో అయోమయంలో ఉన్న అభిమానులకు పెద్ద ఊరట లభించింది. భారతదేశంలోనే కాదు... ప్రపంచ దేశాల్లో ‘కబాలి’ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని కోట్లాది కళ్లు ఎదురు చూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  release  lingaa  Madras High court  

Other Articles