The world's biggest family: The man with 39 wives, 94 children and 33 grandchildren

Indian man has 39 wives 94 children and 33 grandchildren

Ziona Chana, 39 wives, 94 children, 100-room mansion, 14-daughters-in-law and 33 grandchildren, 30 whole chickens, Baktwang village, Mizoram, india, God's special child, lucky man, wife Zathiangi, worlds,biggest,family,Ziona,Chan,39,wives,94,children,33,grandchildren. modern drutharatra, kouravas family, kourava number children

Ziona Chana is head of the world's biggest family - and says he is 'blessed' to have his 39 wives. He also has 94 children, 14-daughters-in-law and 33 grandchildren.

దృతరాష్ట్రుడు కాకపోయినా.. కౌరవ సంఖ్యకు చేరువలో సంతానం..

Posted: 07/18/2016 11:13 AM IST
Indian man has 39 wives 94 children and 33 grandchildren

జగమంత కుటుంబం నాది, అన్న పాటకు అక్షరాల నిజం చేద్దామనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఈ ఇంటి పెద్దకు అదుపాజ్ఞల్లో సుమారు 200 మంది వున్నారంటే అతిశయోక్తి కాదు. కొందరు అన్నట్లు మహాభారతంలో దృతరాష్ట్రుడి మాదిరిగా కౌరవ సంతానానికి కేవలం ఒక సిక్సర్ వద్ద నిలిచిపోయాడు. అంటే సంతానం ఎంతమంది అంటారా.. అక్షరాల 94 మంది. అదేంటి అలా అంటారు, ఈయన నిజంగా కలియుగ దృతరాష్ట్రడే కదా అన్న వారు కూడా లేకపోలేదు. అయితే ఆ దృతరాష్ట్రుడికి కేవలం ఒక్క భార్య మాత్రమే. మరీ ఈ కలియుగ దృతరాష్ట్రుడికి మాత్రం 39 మంది భార్యలు.

ఇంటి నిండా జనంతో నిండు జీవితం ఆయనది. 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్లు, 33 మంది మనుమలు, మనవరాళ్లతో కలిపి 200 మంది వరకు ఉంటారు. ఈ ఇంటికి పెద్ద ఎవరు..? అయన పేరు ఏమిటీ..? అంటారు కదూ అయన పేరు జీయోనా చానా. ఈయన కూడా భారతీయుడే. మిజోరం రాష్ట్రంలోని భక్తవాంగ్‌ గ్రామంలో ఆయన నివాసం వుంటున్నారు. ఓ పెద్ద హోటల్ లా తలపించే ఈ నాలుగు అంతస్థుల భవనం.. అందులోని 100 గదులే ఆయన నివాస సముదాయం.

ఈయన ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి పెద్దగా కూడా ఖ్యాతి గడించారు. నేను నా కుటుంబం అంటూ ఉమ్మడి కుటుంబాలు చిన్నభిన్నమై.. చిన్న కుటుంబం చింత లేని కుటుంబాలు రాజ్యమేలుతున్న తరుణంలో.. 200 మందికి పెద్దగా వుంటడం పట్ల చానా గర్వపడుతుంటారు. అయన దేవుడికి ముద్దబిడ్డ కావడంతోనే ఆయనకు ఇంత సంతానం కలిగిందని చెప్పకోస్తారు. తన కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తన బార్య, పిల్లలు, మనుమలు, మనవరాళ్లు అందరూ కాచుకోవడం వల్ల తాను అదృష్టవంతుడినని చెప్పుకుని సంతోషిస్తారు చానా.

చానా 1945లో పుట్టిన జియోనాకు 17వ ఏటనే వివాహం అయింది. ఆయనకు ఇప్పుడు 39 మంది భార్యలు. చిన్న భార్య వయసు 38 ఏళ్లు. ఒక ఏడాదిలో ఏకంగా 10 పెళ్లిళ్లు చేసుకున్నారు. క్రైస్తవ మతానికి చెందిన చానా తెగలో బహు భార్యత్వం ఉంది. 70ఏళ్లు పైబడిని చానా అంతమంది బార్యలను ఎలా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయన పెళ్లిళ్లకు భారత దేశంలోని చట్టాలు ఎలా అనుమతించాయి అంటారా..? అసలు అయన భార్యలు అందుకు ఎలా అంగీకరించారు..? అంటే ఆయన వివాహాల్లో అర్థం వుంది కాబట్టి.

వివాహం వయస్సు వచ్చినా పెళ్లిళ్లు చేసే స్తోమత లేని తల్లిదండ్రులను అయన ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. అత్యధిక మంది వివాహాలు చేసుకోలేని వారే కావడం.. వారిని సహృదయంతో ఆయన పెళ్లి చేసుకున్నారట. అలా అంతమందినీ పెళ్లి చేసుకోవడానికి ఏదో ఒకటి కారణమట. దాంతో తన భర్తలోని సదుద్దేశాన్ని గ్రహించిన సతీమణులు కూడా అయన వివాహాలకు అడ్డుచెప్పలేదట. ఇక సతీమణుల పిర్యాదులు లేనిదే.. చట్టం జోక్యం చేసుకోలేదు. దీంతో ఆయన ఏకంగా 39 మందిని పెళ్లి చేసుకున్నారు. 94 మంది సంతానాన్ని కన్నారు. జియోనా ఎవరినీ మోసగించి పెళ్లి చేసుకోలేదని, బహుభార్యత్వం తమ తెగలో మొదటి నుంచి ఉందని చెప్పారు. తమ భార్యలు ఎవరి మధ్య గొడవలు లేవని, అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోచ్చారు.

ఇది సరే. 200 మంది బోజన ఇత్యాదులకు ఎంత వండాలి.. అంటే..? అందరూ భోజనానికి కూర్చోవాలంటే 39 కోళ్లు తెగాల్సిందేనట.. అందరూ అన్నం తినాలంటే కనీసం 50 కిలోల బియ్యం వండాలి. 60 కిలోల బంగాళదుంపలు కూర ఉంటేనే పూట గడిచేది. ఇది ఒక కుటుంబం కథ. జియోనా తన భార్యలతో ఎలా గడుపుతాడని అందరికీ అనుమానం రావచ్చు. ఆయన మాత్రం అంత టెన్షన్ అవసరం లేదని, భార్యలే ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమయం కేటాయించుకుంటారని జియోనా అన్నారు. కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఉండేందుకు వీలుగా నాలుగు అంతస్థుల భవనం నిర్మించారు. తమ గ్రామానికి వచ్చే అతిథుల కోసం ఒక గెస్ట్‌ హౌస్‌ కూడా నిర్మించారు. పిల్లల కోసం జియోనా కుటుంబం ఒక స్కూల్‌ నడుపుకుంటోంది. ఇంట్లోవాళ్లే ఉపాధ్యాయులు.

జియోనా కుటుంబం స్వయంగా వ్యవసాయం చేస్తోంది. కోళ్లు, పందుల పెంపకం నిర్వహిస్తుంది. వారికి అవసరమైన ఆహారాన్ని వారే పండించుకుంటారు. పైగా తేయాకు తోటలు కూడా ఉన్నాయి. కుటుంబంలో కొందరు తేయాకు తోటలో పనిచేస్తారు. వడ్రంగి పని చేస్తారు. ఇంట్లో ప్రతి గదిలో ఒక టీవీ ఏర్పాటు చేశారు. ఇంటి మరమ్మత్తులు కూడా వాళ్లే చేసుకుంటారు. కాగా ఈనెల 21న జియోనా తన 71వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోబోతున్నారు. అతను మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : worlds biggest family  Ziona Chana  39  wives  94 children  33  grandchildren  Mizoram  

Other Articles