అనుమానంతో భార్యను నరికాడు | Husband attacked wife with knife in Vijayawada

Husband attacked wife with knife in vijayawada

mahesh attack wife tejaswini, Husband attacked his wife in Vijayawada, Vijayawada husband attack with knife, Vijayawada Husband attacked wife

Husband attacked his wife in Vijayawada with knife in public in broad daylight seriously injuring her. The man had earlier attacked Tejaswini after which she left for her mother's home.

ITEMVIDEOS:అనుమానంతో పబ్లిక్ గా భార్యను ఏం చేశాడో చూడండి

Posted: 07/18/2016 12:18 PM IST
Husband attacked wife with knife in vijayawada

మానవ సంబంధాలు రాను రాను దిగజారిపోయతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ ఉన్మాది కసాయిగా మారి ఆమెను చంపాలని చూశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య ఆమె ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.

ఆదివారం విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాళ్లోకి వెళితే... పట్టణానికి చెందిన మహేష్-తేజస్వినిలకు ఏడాదిన్నర క్రితం పెళ్లయ్యింది. కొంత కాలంగా దంపతుల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. భర్త ప్రవర్తనతో తేజస్విని విసిగివేసారినట్లు తెలుస్తోంది. దీనితో మహేష్ ను శాశ్వతంగా వదిలించుకోవాలంటే విడాకులు ఒక్కటే పరిష్కారమని భావించిన తేజస్విని కోర్టు మెట్లు ఎక్కింది. మూడు నెలల క్రితం విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అయితే భార్య ఎవరితోనో సంబంధం పెట్టుకుందని, అందుకే విడాకులు అడుగుతుందని అనుమానంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు మహేష్.

ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం ప్రార్థన కోసం తేజస్విని చర్చీకి వెళ్లింది. అనంతరం ఇంటికి బయలదేరిన ఆమెపై పెజ్జోనిపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అప్పటికే కాపు కాసి ఉన్న మహేష్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. చుట్టూ జనాలు ఉన్నా ఎవరూ ధైర్యం చేసి తేజస్విని కాపాడేందుకు ముందుకు రాలేకపోయారు. తీవ్రరక్తస్రావంలో కొట్టుమిట్టాడుతున్న తేజస్విని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పరారీలో ఉన్న మహేష్ కోసం సత్యనారాయణపురం పోలీసులు గాలింపులు చేపట్టారు. కాగా, వీరిద్దరిది ప్రేమ వివాహం కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  husband  wife  Mahesh  Tejaswini  attack  

Other Articles