హైదరాబాద్ లో అరెస్టయ్యింది ఐసిస్ చీఫా? | NIA claims Yasir was Hyderabad IS module chief

Nia claims yasir was hyderabad is module chief

ISIS chief arrested in hyderabad, Yasir arrested by NIA. yasir Hyderabad ISIS chief

Hyderabad IS module chief Yasir arrested by NIA.

హైదరాబాద్ లో అరెస్టయ్యింది ఐసిస్ చీఫా?

Posted: 07/13/2016 11:55 AM IST
Nia claims yasir was hyderabad is module chief

ఉగ్ర రాక్షస మూక ఐఎస్ఐఎస్ కు హైదరాబాదులో ప్రత్యేక విభాగముందా? అవుననే అంటున్నాయి ఎన్ఐఏ వర్గాలు. దేశంలోని పలు ప్రాంతాల్లో పెను విధ్వంసానికి కుట్ర పన్నిన ఐదుగురు ఐఎస్ ఉగ్రవాదులను ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారిచ్చిన సమచారంతో తాజాగా మంగళవారం మరో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరిలో ఒకడైన నాయిమతుల్లా హిసల్లానీ అలియాస్ యాసీర్ హైదరాబాదులోని ఐఎస్ నెట్ వర్క్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్నాడట. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంచలన కథనం ప్రుచురించింది. తెలంగాణ ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం... ఇక యాసీర్ బాగ్దాద్ కి చెందిన ఐఎస్ విభాగం ఖలీఫాకు చెందిన వాడు. రెండేళ్లుగా అతను అందులో యాక్టివ్ సభ్యుడిగా ఉన్నాడు. నిధుల సేకరణతోపాటు యువతను ఉగ్ర కార్యకలాపాల వైపు మొగ్గేలా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అంటూ అందులో పేర్కొంది. ఓ బట్టలో షాపులో పని చేస్తున్న యాసీర్, టోఫెల్ విద్యార్థులకు ట్యూషన్ లు చెప్పే రెహ్మన్ లు ఇద్దరూ పలు దఫాలుగా ఐఎస్ సమావేశాల్లో పాల్గొన్నారని ఆ కథనం సారాంశం.

ఈ ఇద్దరితో పెను విధ్వంసానికి పథక రచన చేసినట్లు తేలింది. జనావాసాలనే కాకుండా దేశ రక్షణ, సైనిక స్థావరాలపై కూడా భీకర దారులకు వారు ఫ్లాన్ చేసినట్లు తాజాగా వెలుగుచూసింది. పాతబస్తీలో ఏర్పాటు చేసుకున్న మకాం నుంచి వారు విదేశాల్లో ఉన్న సూత్రధారితో పలుమార్లు ఫోన్ లో సంభాషించినట్లు తేలింది. ఈ సంభాషణల్లో భాగంగా ప్రధానంగా భారత రక్షణ, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పేట్రేగిపోవాలని సూత్రధారి వీరిద్దరికి ఆదేశాలు జారీ చేశాడు. సదరు దాడులు యావత్తు భారత దేశాన్ని భయకంపితులను చేసేలా ఉండాలని కూడా చెప్పాడంట.

దీంతో ఉగ్రవాదులు తమకు సమీపంలో, చేతికందే దూరంలోని సికింద్రాబాదు కంటోన్మెంట్ ను టార్గెట్ గా ఎంచుకున్నారు. తుపాకులు చేతబట్టి కాల్పులు జరుపుతూ కంటోన్మెంట్ లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ ప్రాంతంలో రెక్కీ కూడా నిర్వహించారు. ఈ మేరకు అరెస్టైన ఏడుగురు భీతిగొలిపే వాస్తవాలను వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Hyderabad  NIA  IS chief Yasir  

Other Articles