Aussie who bit off rat’s head & posted video online banned from owning pets

Aussie man who bit off rat s head banned from keeping pets

australia, rat, mad matt, animal cruelty, Brisbane Matthew Maloney, animal rights, man bites off rat's head, facebook, facebook live, video, social media, community service, barred from pets, crime

An Australian man who filmed himself biting the head off a live rat and posting the video on Facebook was banned from owning pets for three years and ordered to do community service.

ITEMVIDEOS: ఓరి వీడి సైకో చేష్టల దుంపతెగ..

Posted: 07/12/2016 09:42 AM IST
Aussie man who bit off rat s head banned from keeping pets

జివ్హకో రుచి.. పుర్రెకో బుద్ది అన్న పెద్దల నానుడి.. సోషల్ మీడియా పుణ్యమా అని బాహ్య ప్రపంచానికి అధికంగా కనబడుతున్నాయి. ఇటీవల భారత్ లో ఓ శునకాన్ని ఇబ్బందులకు గురిచేసి అంతటితో అగకుండా దానిని మూడంస్థుల భవనంపై నుంచి కిందకు తోసేసిన ఘటనలో ఇద్దరు మెడిసిన్ విద్యార్థులు సస్సెన్షన్ కు గురికాగా, తాజాగా అస్ట్రేలియా ఓ మరో సైకో ఓ మూగజీవిని హింసించి.. దాన్ని రాచిరంపాన పెట్టడం.. అది చాలదన్నట్లు యావత్ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన కోర్టు మెట్లెక్కాడు.

కేవలం సోషల్ మీడియాలో తన అకౌంటుకు లైక్ లు షేర్లు పెంచుకోవడంతో కోసం ఎందరో ఎన్నో తరహా సవాళ్లు తెరపైకి తీసుకువస్తుండగా, వాటిలో పాల్గోంటున్న కొందరు మాత్రం తాము చేస్తున్న పనుల తమకు ఎలాంటి పరిణామాలను తీసుకువస్తుందన్న విషయాలను కూడా మర్చిపోయి.. అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. 'మ్యాడ్ మాట్'గా గుర్తింపు తెచ్చుకున్న మాథ్యూ మాలొనే ఈ ఏడాది జనవరిలో బతికున్న ఎలుక తలను నోటితో కొరికేశాడు. తర్వాత వోడ్కాతో దాన్ని శుభ్రం చేశాడు. అనంతరం దాని ముఖంపై బాదుతూ 'దాన్ని కొట్టటండి' అంటూ అరిచాడు.

ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్టు చేశాడు. అతడిపై నెటిజన్లు విరుచుకుపడడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. చెడ్డ పని చేసినందుకు సమాజ సేవ చేయాలని అతడిని న్యాయస్థానం ఆదేశించింది. 100 గంటల పాటు సామాజిక సేవ చేయాలని అతడిని బ్రిస్బేన్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఆదేశించింది. 25 ఏళ్ల మాథ్యూ మాలొనే మూడేళ్ల పాటు జంతువులను పెంచుకోకుండా అతడిపై నిషేధం విధించింది. అయితే తాను చేసిన పని పట్ల అతడు విచారం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  animal rights  Brisbane Matthew Maloney  man bites off rat's head  crime  

Other Articles