అలా చేసి ఉంటే చిన్నారి రమ్య బతికేది! ! postmortem on baby ramya's death

Postmortem on baby ramya s death

Baby Ramya accident in Panjagutta, Baby Ramya Died, Postmortem on baby ramya's death

Baby Ramya died in panjagutta Accident. Now Postmortem on baby ramya's death.

ITEMVIDEOS: అలా చేసి ఉంటే చిన్నారి రమ్య బతికేది!

Posted: 07/11/2016 01:52 PM IST
Postmortem on baby ramya s death

ఇది మనకు అలవాటయిన పనే. ప్రమాదం జరగే ముందు జాగ్రత్తగా ఉండటం మానేసి... తీరా అంతా అయ్యాక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాం. సరిగ్గా చిన్నారి రమ్య ఉదంతంలో కూడా అదే జరుగుతుంది. తప్పతాగి కారు నడిపి చిన్నారి రమ్య(9) ప్రాణాలు పోవడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు తాపీగా చెప్పటం దీనికి నిదర్శనం.

అలా కాకుండా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పిశాచులను ముందుగానే నిలువరించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదేమో!. రెండు బతుకులు విగతజీవులు అయి ఉండేవి కాదేమో!. ప్రమాదం జరిగిన వెంటనే రమ్య బాబాయ్ రాజేష్ అక్కడిక్కడే మృతిచెందగా, 9 రోజులుగా మృత్యువుతో పోరాడి రమ్య మృతి ఒడిలోకి జారుకుంది. ఇక రమ్య కన్నతల్లి రాధికా, తాతయ్య మధుసుధనా చారిలు ఆసుపత్రి పాలై క్షతగాత్రులుగా మిగిలారు. ఇక ఇప్పుడు రమ్య మృతదేహం సాక్షిగా ఘనటపై పోస్ట్ మార్టం జరుగుతోంది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. అంతా స్టూడెంట్స్ తప్పతాగి ఉన్నారు. డ్రైవింగ్ చేసిన వ్యక్తి మైనర్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా నడిపాడు.  పైగా తప్ప తాగి మరీ. ఒకవైపు ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశామని, చెకింగ్ లతో ఊదరగొడుతూ చలాన్లు వసూలు చేస్తున్న అధికారులు ఈ దుర్ఘటనపై  ఏం స్పందిస్తారు. పోనీ తప్పులు చేయటం మానవ సహజం అని సర్దిపుచ్చుకుంటే, ఏ తప్పూ చేయని పదేళ్లు లేని పసిప్రాయం బలికావాల్సి వచ్చింది.

ఇక 21 ఏళ్లు కూడా నిండని వ్యక్తికి మద్యం అమ్మడం నేరమని, అది కూడా పరిగణనలోకి తీసుకుని బార్ యాజమానిపై కేసు నమోదు చేస్తామని ఖాకీలు చెబుతున్నాయి. నిందితుడు అండ్ కో మద్యం అమ్మిఉండకపోయినా, మద్యం సేవించి వారు డ్రైవింగ్ చేయకపోయినా, అధికారులు అప్రమత్తం అయి ఉండి వారిని ముందే గమనించి ఉన్నా... ఆ కుటుంబానికి శోకం తప్పేది. అలా కాకుండా పదేళ్ల జైలు శిక్ష తో పోయినా రెండు ప్రాణాలు, ఆ తల్లి గుండె కోత తీరుతుందా?. ఇవన్నీ పక్కనబెట్టి విద్యార్థులు జీవితాలు నాశనం చేయొద్దంటూ కొందరు వాదిస్తున్నారు... అయితే ఏంటీ? అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న వారిని వదలేయాల్సిందేనా? పక్కా ఆధారాలతో దొరికిన వారు కఠిన శిక్ష అనుభవించాల్సిందేనని వారి మనసాక్షికి మాత్రం అనిపించదా?  

ఇంకోవైపు రమ్యకు చికిత్స అందించిన ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. సమయానికి ఆపరేషన్ చేసి ఉంటే రమ్య బతికి ఉండేదని, అలా కాకుండా తాత్సారం చేసినందునే చనిపోయిందని బంధువులు వాదిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియరావటం లేదు. ప్రస్తుతం ఆ ఇల్లు శోకసంద్రలో నిండిపోయింది. కానీ, పుట్టెడు దుఖంలోనూ రమ్య అవయవదానాలకు అంగీకరించి ముందుకు రావటంపై ఆ మాతృమూర్తికి జోహార్లు.

నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్ వల్లే ఈ దారుణం జరిగిందని అని తేలిగ్గా కొట్టేయకుండా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరిగి మరిన్ని రమ్యలాంటి మరిన్ని పసిప్రాణాలు అనంతవాయువుల్లో కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక్క ప్రభుత్వంపైనే కాదు మనందరిపైనా ఉంది. న్యాయం చేస్తామంటూ నేతలు ఇస్తున్న హమీలను అవసరం లేదు. తాగుబోతుల హత్యగా అభివర్ణిస్తు వరుస కథనాలు వేస్తున్న మీడియా ను పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ, గుండెలు అలిసేలా రోదిస్తున్న ఆ తల్లి ఏడ్పు చూసైనా సరే తల్లిదండ్రులూ... ఎదిగే తమ పిల్లలు ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచింది. జైహింద్...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panjagutta  accident  Ramya  

Other Articles