Murali Manohar Joshi not invited at BJP National Executive meet

Murli manohar joshi not invited to national executive meeting

Murali Manohar Joshi, BJP national executive meet in Allahabad, Murali Manohar Joshi not invited to BJP meet, BJP, Varanasi, Narendra Modi, National Executive Meeting

Senior BJP leader Murali Manohar Joshi has not been invited to the two-day executive meet of the party being held in Allahabad.

సీనియర్ నేతను అవమానించిన బీజేపి.. మండిపడ్డ అభిమానులు

Posted: 06/13/2016 10:58 AM IST
Murli manohar joshi not invited to national executive meeting

కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యానికి ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన బిజేపిని.. పార్లమెంటులో రెండు స్థానాలతో తమ బలాన్ని నిరూపించుకుని.. అనతికాలంలోనే అధికారంలోకి వచ్చేలా చేసింది మాత్రం సీనయర్లే.  తమ భుజాలపై పార్టీని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరింపజేయడానికి అహర్నిషలు కృషి చేసింది మాత్రం సీనియర్లే అనడంలో సందేహమే లేదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిడం వెనుక కూడా వారి శ్రమ దాగివుందన్నది సత్యం. అయితే ప్రస్తుతం మాత్రం వారికి సొంత పార్టీలోనే అవమానాలకు గురవుతున్నారు.

బీజేపీ మూల స్తంభాలుగా చెప్పుకునే వాజ్ పేయీ, లాల్ కృష్ణ అద్వానీల సమకాలీనులుగా, బీజేపీ సీనియర్ నేతగా మురళీ మనోహర్ జోషీకి పేరుంది. అలాంటి వ్యక్తిని బీజేపీ తీవ్ర అవమానానికి గురి చేసింది. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ 'వికాస్ పర్వ్' పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్‌ లో రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. గత రెండు రోజులుగా మురళీ మనోహర్ జోషి అలహాబాద్ లోనే ఉన్నారు. ఆ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ప్రాతినిధ్యం కూడా వహించారు.

ఆయన విద్య, రాజకీయ జీవితం ప్రారంభమైంది కూడా అక్కడి నుంచే. అలాంటి వ్యక్తికి బీజేపీ ఎలాంటి ఆహ్వానం పంపలేదు. అంతే కాదు, ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్లు, హోర్డింగుల్లో కూడా ఆయన ఫోటో ముద్రించలేదు. మాజీ ప్రధాని వాజ్‌ పేయి, అద్వానీల ఫోటోలను మాత్రం ముద్రించిన బీజేపి మురళీ మనోహర్ జోషి. దీనిపై ఆయన సన్నిహిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. మురళీ మనోహర్ జోషికి జరిగిన అవమానంపై అలహాబాద్ నగరం మొత్తం పోస్టర్లు అంటించి మరీ నిరసన తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles