40000 sign up for London's first naked restaurant

The bunyadi london s first naked restaurant opens

London's first naked restaurant, The Bunyadi, naked restaurant, bunyadi, nude dinner, london, waiting list

"this meal would taste better naked," then London's newest pop-up restaurant, already has over 40,000 people on the waiting list.

ITEMVIDEOS: బట్టలు లేకుండా బోజనానికి పెద్ద క్యూ..

Posted: 06/13/2016 11:42 AM IST
The bunyadi london s first naked restaurant opens

బ్రిటన్లోని లండన్లో ప్రారంభమైన బున్యాడి రెస్టారెంటులో బోజనం చేయడానికి వేల మంది వెయిట్ చేస్తున్నారు. ఏమిటా రెస్టారెంట్ స్పెషల్.. అక్కడి వంటకాల రుచి మైమరిచిపోయేలా చేస్తుందా..? లేక మరేదైనా కారణం వుందా..? రెండు రోజుల క్రితం ప్రారంభమైన రెస్టారెంటుకు ఎందకంత డిమాండ్ అనుకుంటున్నారా..? అవును నిజమే ఈ రెస్టారెంటులో ఓ ప్రత్యేకత వుంది. అక్కడి వంటకాల సంగతి ఎలాగున్నా.. అక్కడ బోజనం చేసినంత సేపు మాత్రం ప్రపంచాన్ని మర్చిపోతారట.

అనుమానాలు అవసరం లేదు. నిజంగా ప్రపంచాన్ని మైమర్చిపోయేలా చేస్తుంది ఆ రెస్టారెంటు. ఎందుకంటూ ఆ రెస్టారెంట్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా బట్టలు లేకుండా వెళ్లాలి. రెస్టారెంటు ప్రారంభమైన తొలి రోజు 42 మంది బట్టల్లేకుండా భోజనాన్ని లాగించేశారు. దీంతో ఈ రెస్టారెంటులోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా..? ఎప్పుడు వలువలను వదిలేసి బోజనాలను లాగించేద్దామా అని వేల మంది క్యూ కట్టారంటే. అ రెస్టారెంటుకు వున్న డిమాండ్ అర్థమవుతుంది. అంటే బట్టలు లేకుండా బోజనం చేయడానికి వేల మంది ఎదురుచూస్తున్నారు.

లండన్లో బున్యాది  రెస్టారెంటులోకి వచ్చేవారు దుస్తులన్నింటిని విప్పేసుకొని భోంచేసే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. అయితే, ఇందులో తీవ్ర నిరుత్సాహ పరిచే విషయం ఏమిటంటే.. ఈ రెస్టారెంటులో ఒకసారి 42 మాత్రమే కూర్చుని భోంచేసే అవకాశం ఉంది. దీంతో మొదటి 42మంది తప్ప మిగితా వారంతా క్యూ కట్టి ఎదురుచూడాల్సిందే. పోని ఇంకోసారి వద్దాంలే అనుకుని వెళ్లారో.. తిరిగొచ్చేవరకు మరో భారీ క్యూ వెనకాలే నిల్చోవడం కాయం.

ఈ నేపథ్యంలో తమ వంతుకోసం ఎన్నిరోజులైనా పర్వాలేదనుకొని వేలమంది ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇలా 42మంది మాత్రమే బట్టలు విప్పేసుకొని భోంచేసే సామర్ధ్యం ఉన్న ఈ రెస్టారెంట్ కోసం ఇప్పటికే 40 వేలమందికి పైగా సైనప్ అయ్యారు. ఈ రెస్టారెంటును లాలిపాప్ అనే కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ రెస్టారెంటుకు వస్తున్న స్పందనను చూసి ఆ కంపెనీ యజమాని సెబ్ లియాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'బీచ్ ల్లాంటి ప్రదేశాల్లో.. స్నానం చేసే వేళల్లో ప్రజలు కాస్త సిగ్గుపడుతూనైనా నగ్నంగా మారిపోవాలని అనుకుంటారు.

అలాంటిది స్వేచ్ఛగా నగ్నంగా మారేందుకు వీలు కల్పిస్తే సాధారణంగానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు' అని ఆయన చెప్పారు. అయితే, నగ్నంగా ఈ రెస్టారెంటుకు వచ్చిన వారికి వడ్డించే వారు మాత్రం అర్ధనగ్నంగా ఉంటారు. ఇందులో ఒకసారి భోంచేయాలంటే.. కనీసం ఏడువేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇందులో సెల్ఫీలవంటి వాటికి అనుమతించరు. ఇందులోకి ప్రవేశించే ముందే వారి ఎలక్ట్రానిక్ డివైస్లు అన్నీ కూడా రిసెప్షన్లో పెట్టి వెళ్లాల్సి ఉంటుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles