అవిభక్త కవలల విషయంలో బ్యాడ్ న్యూస్ | AIIMS doctors drop from Veena Vani surgery

Aiims doctors drop from veena vani surgery

AIIMS doctors, Veena Vani surgery, nilofer hospital

AIIMS doctors drop from Veena Vani surgery. death threat or suffer from diseases for lifetime.

ITEMVIDEOS: అవిభక్త కవలల విషయంలో బ్యాడ్ న్యూస్

Posted: 06/09/2016 12:26 PM IST
Aiims doctors drop from veena vani surgery

అవిభక్త కవలలు వీణా-వాణీల విషయంలో ఓ చేదువార్త. వీరిని విడదీసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు దాదాపుగా నిలిచిపోయినట్లే అనుకోవచ్చు. వేర్వేరు తలలు, వేర్వేరు శరీరాలతో జన్మించినప్పటికీ తలలు అతుక్కుని ఉండటంతో ఈ అవిభక్త కవలలు ఇంత కాలం ఆస్పత్రికే పరిమితమయ్యారు. అయితే దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత వీరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవతీసుకుంది.  వీరిని విడదీసేందుకు ఎంత మేర ఖర్చు అయినా వెనుకాడేది లేదని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.

స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ యే ఈ విషయంలో జోక్యం చేసుకోవటంతో వైద్య సిబ్బంది కదిలారు. నీలోఫర్ ఆస్పత్రిలో ఉన్న వీరిని  ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారతీయ వైద్య విజ్ఞాల సంస్థ (ఎయిమ్స్) బృందం పరిశీలించింది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత వీరిని విడదీయటం మా వల్ల కాదంటూ చేతులెత్తేసింది. ఒకవేళ ఆపరేషన్ చేసినా వారికి ప్రాణహాని ఉండే అవకాశం ఎక్కువటగా ఉందట. ఒకవేళ బతికినా జీవితాంతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడతారని వారు చెబుతున్నారు.

దీంతో వారిని విడదీసి కొత్త జీవితం ప్రసాదిద్దామనుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. అయితే విదేశాలకు పంపి అక్కడ వైద్యులు సంప్రదించాలన్న ఆలోచనలో వైద్యాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాలపై భరోసా లేకపోవడం, ఇంటికి తీసుకెళ్తే పోషించే స్థోమత లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIIMS doctors  Veena Vani surgery  nilofer hospital  

Other Articles