mudragada strike effect on chandrababu press meet, leaves in middle

Chandrababu stops his media conferece all of a sudden

mudragada hunger strike, mudragada padmanabham, journalists, police restictions, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR

Kapu caste leader Mudragada padmanbham had been sucessfull in shaking TDP government, by effecting CM chandrababu press meet, naidu has left his press meet in mid way.

అటు జర్నలిస్టుల ధర్నా.. ఇటు ప్రెస్ మీట్ మధ్యలోనే లేచివెళ్లిన చంద్రబాబు

Posted: 06/09/2016 11:31 AM IST
Chandrababu stops his media conferece all of a sudden

తూర్పు గోదావరి జిల్లాలో కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష నవ్యాంధ్రప్రదేశ్ లో కోలువుదీరిన చంద్రబాబు సర్కార్ ను వణికించిందా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. కడప జిల్లాలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని టెన్షన్ కు గురి చేసింది. ఓ వైపు ముద్రగడ దీక్ష ప్రారంభించగా... కుల రాజకీయాలతో ముద్రగడ పద్మనాభం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడతున్నారని అరోపించారు. కాపుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతోందని చెప్పారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అవసరమని, పోలీసులపైకే తిరగబడిన వారిని ఎలా వదిలివేయాలని ఆయన ప్రశ్నించారు. కాపులను బిసిలలో చేర్చి దానిని అమలుచేయాన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపులకు దెవుడయ్యాడు.. కాపుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తాము బీసీలలో చేర్చేందుకు కమిటీ వేసి, కాపుల సంక్షేమం కోసం కమీషన్ ను ఏర్పాటు చేసిన తాను శత్రువును ఎలా అయ్యానో చెప్పాలన్నారు. ఇప్పటికైనా కాపులు నిజనిజాలను గుర్తెరుగాలన్నారు.

ఈ మేరకు కడపలో వున్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన నవ నిర్మాణ దీక్ష గురించిన వివరాలను వెల్లడించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాను అసలు విషయానికి రాకుండానే ప్రేస్ మీట్ నుంచి అర్థంతరంగా లేచివెళ్లిపోయారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతుండగానే... ఆయన వద్దకు వచ్చిన అధికారులు ఆయనకు ఏదో విషయం చెప్పారు. దీంతో మీడియా సమావేశాన్ని మధ్యలోనే ఆపేసిన చంద్రబాబు అక్కడి నుంచి లేచి వెళ్లారు.

ముద్రగడ చేతిలో పురుగుల మందు డబ్బా ఉన్న విషయంతో పాటు తనను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్న పోలీసులను ముద్రగడ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారన్న విషయం తెలియడంతోనే చంద్రబాబు ఒకింత టెన్షన్ కు గురై మీడియా సమావేశం నుంచి లేచి వెళ్లినట్లు సమాచారం. ఇక కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో తమపై పోలీసులు బలంవంతంగా పెట్టిన అంక్షలపై జర్నలిస్టులు అందోళన బాటపట్టారు. ముద్రగడ పద్మనాభం నివాసంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో జర్నలిస్టులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పోలీసులు చర్యకు నిరసనగా ముద్రగడ నివాసం వద్ద జర్నలిస్టులు ధర్నాకు దిగారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles