అపరిచితులతో చాటింగ్ మహాడేంజర్ | teenage girl raped by facebook friend in madagascar

Teenage girl raped by facebook friend in madagascar

Madagascar girl, raped by facebook friend, ఫేస్ బుక్ స్నేహితుడు, మడగాస్కర్ బాలిక, అత్యాచారం, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, telugu news

teenage girl raped by facebook friend in madagascar.She spent the first two weeks in captivity unconscious, after which she remembers being repeatedly raped, abused and fed drugs to force her into submission and stop her escaping.

అపరిచితులతో చాటింగ్ మహాడేంజర్

Posted: 06/08/2016 01:04 PM IST
Teenage girl raped by facebook friend in madagascar

సోషల్ మీడియా యావ ఇప్పటి యువతలో ఏ రేంజ్ లో ఉందో ప్ర్యతేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత ఎక్కువ మంది  ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్ప అని తెగ ఫీలయిపోతున్నారు. అంతేనా వారు పెట్టే ఫోటోలు వాటికొచ్చే లైక్ లు ఎంత ఎక్కువగా ఉంటే అంటే తోపులన్న మాట. ఇలాంటి కోరికతోనే ఓ యువతి జీవితం నాశనం చేసుకున్న ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. అపరిచితులతో చాటింగ్ ఎంత ప్రమాదకరమో చెప్పే ఈ ఉదంతం విషయంలోకి వెళితే...

మడగాస్కర్ కు చెందిన 17 ఏళ్ల యువతి ఫేస్ బుక్ లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలనే ఆశ పుట్టింది. ఈ క్రమంలో ఎవరికి పడితే వారికి రిక్వెస్ట్ లు పంపడంతోపాటు, ఎవరి నుంచి రిక్వెస్ట్ లు వచ్చినా యాడ్ చేసేసుకుంది. అప్పటిదాకా 310 మంది ఉన్న ఆమె జాబితా వేలలోకి వెళ్లిపోవటంతో సంబరపడిపోయింది. ఇక ఆ లిస్ట్ లో 28 ఏళ్ల యువకుడు బాగా క్లోజయ్యింది. ఆరు నెలలు వీరిద్దరు ఆన్ లైన్లో ఫ్రెండ్ షిప్ కొనసాగించారు. చివరికి కలుద్దామన్న ఆ యువకుడి ఆహ్వనం మేరకు అతని ఇంటికి వెళ్లింది ఆ యువతి. అంతే ఆమెకు అక్కడి నుంచి ఆమెకు నరకం చూపించాడు.

డ్రగ్స్ ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహ నుంచి రాగానే మళ్లీ మత్తు మందు ఇచ్చి  అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇలా ఏకదాటిగా 2 నెలలపాటు ఆమెపై లైంగిక దాడికి గురయ్యింది. ఆమె రోదనలు విన్న యువకుడి చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటికి వచ్చింది. తాను స్కూల్ పరీక్షల్లో ఫేలయ్యాయని, ప్రతిగా 200 డాలర్లు ఇస్తే పాస్ చేస్తానని టీచర్ చెప్పిందని యువతి పేర్కొంది. అప్పటికే ఫేస్ బుక్ లో పరిచయమైన ఆ యువకుడు సాయం చేస్తానటంతోనే వెళ్లి కలిశానని చెప్పుకోచ్చింది. ఇలా సోషల్ మీడియాలో అపరిచితులతో ఫ్రెండ్ షిప్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని హెచ్చరిస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madagascar girl  raped by facebook friend  facebook rape  

Other Articles