Human trafficking in gulf

Human trafficking in gulf

Human trafficking in gulf, Indian girls export, Minister Raghunath reddy, Palle Raghunath reddy, Politics, sushma swaraj, gulf, womans, work, news, sports

Human trafficking in gulf: Girls in Gulf are reportedly facing the tracking issue, which is now going viral.

ఆ దేశంలో అమ్మాయిలను ఇలా చేస్తారా?

Posted: 05/26/2016 10:26 AM IST
Human trafficking in gulf

మొన్నటివరకు బ్రతుకుజీవుడా అనుకుంటూ మగవాళ్లు గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందులకు గురయ్యేవారు. కానీ ఈసారి మాత్రం అమ్మాయిలను బలవంతంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తూ వారిని అంగట్లో బొమ్మలుగా చూస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రాసిన లేఖ ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

రఘునాథ్ రెడ్డి రాసిన లేఖ సారాంశం ఏంటంటే.... గల్ఫ్ దేశాల్లో పనిచేయించుకునేందుకు ఆంధ్ర నుంచి తెలుగు మహిళలను లక్ష రూపాయల నుంచి 4 లక్షల రూపాయల మధ్య బేరంతో అంగట్లో బొమ్మలను కొన్నట్లుగా కొనుగోలు చేసి, గల్ఫ్ దేశాలకు తీసుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

గల్ఫ్ దేశాలకు మహిళలను తీసుకెళ్లి, వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రొంపిలో నుంచి మహిళలను బయటపడేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని, అక్కడే ఇరుక్కుపోయి తిరిగి రాలేకపోతున్నవారిని వెనక్కి రప్పించాలని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కు రాసిన లేఖలో ఆయన తన ఆవేదనను తెలియజేసారు.

విదేశీ మంత్రిత్వశాఖ కఠిన నియమనిబంధనలు అమలుచేస్తే ఇలాంటి సమస్యలను అధిగమించలేమని, కాబట్టి.. అతి త్వరగా గల్ఫ్ దేశాల్లో ఇరుక్కుపోయి నానా అగచాట్లు పడుతున్న వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని, అలాగే వారికి వారి వారి స్వస్థలాల్లో తగిన ఉపాధిని చూపించి, ఇక్కడే స్థిరపడేట్లుగా చూడాలని రఘునాథ్ రెడ్డి కోరారు.వ్యక్తం చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gulf  Politics  News  Sushma Swaraj  

Other Articles