police complaint against Bollywood actor Ajay Devgan in dehi

Ajay devgan s in yet another trouble

Shivaay, Ajay Devgn, Sayesha Saigal, new poster, Tilak Marg Police Station, Delhi, ajay devgan with shoes, ajay devgan trobles, ajay devgan own directions, ajay devgan doll drums, ajay devgan police complaint

The makers of the upcoming 'Shivaay' are leaving no stone unturned to promote the film, as recently they have shared a new poster of it, but it brings dolldrums to the production team.

నటుడు అజయ్ దేవగన్ ను చుట్టుముట్టిన ఇబ్బందులు

Posted: 05/26/2016 09:02 AM IST
Ajay devgan s in yet another trouble

పనామా పేపర్లలో తన పేరు రావడంతో ఇబ్బందుల్లో పడిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మరోమారు తాజాగా చిక్కుల్లో పడ్డారు. దానికి ఆయన స్వియ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం 'శివాయ్' పోస్టర్ కారణంగా మారింది. అజయ్ దేవగన్ నటించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొటూ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బూట్లు ధరించిన హీరో.. శివుడి ఆకారం పైనుంచి దూకుతున్నట్టుగా పోస్టర్ లో చూపించారని ఇది తమ మతవిశ్వాసాలను దెబ్బతీసేలా వుందని పోలీసులకు పిర్యాదు అందింది.

ఆదిశంకరుడిపై మంచు గొడ్డలి(ఐస్ యాక్స్)ని ప్రయోగించినట్టుగా కూడా ప్రచారచిత్రంలో ఉందని ఢిల్లీకి చెందిన న్యాయవాది మన్మోహన్ సింగ్ ఈ ఫిర్యాదు చేశారు.'శివాయ్' తొలి పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. మంచు కొండల నుంచి తాడుతో వేలాడుతూ, చేతిలో ఆయుధంతో ఉన్న హీరోను పోస్టర్ లో చూపించారు. కాగా, ఈ పోస్టర్ పై శివభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'శివాయ్‌' అక్టోబర్ 16న విడుదల కానుంది. సైరాబాను, దిలీప్‌కుమార్‌, సాయెషా సైగల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. న్యాయవాది పిర్యాదు నేపథ్యంపై చిత్ర యూనిట్ స్పందించాల్సి వుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivaay  Ajay Devgn  Sayesha Saigal  new poster  Tilak Marg PS  Delhi  

Other Articles