ఓడిపోయిన కాగితం పులులు వీరే | These Pulic figures loss elections

These pulic figures loss elections

Tamilnadu, Kerala, Elections, Puducherry, Sreeshanth, Assam, BJP, Kerala, Vijaykanth, West Bengal, Jayalalitha, Karunanidhi, Mamata Banerjee, Oomen Chandi, తమిళనాడు, కేరళ, ఉమెన్ చాంది, కాంగ్రెస్ బిజెపి, పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు

In this five state polls, many public figures getting failure. In Kerala State ex cricketer Sreeshanth loose.

ఓడిపోయిన కాగితం పులులు వీరే

Posted: 05/19/2016 11:35 AM IST
These pulic figures loss elections

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగింట ఊహించిన ఫలితాలే వస్తున్నా కానీ ఒక్క తమిళనాడులో మాత్రం పరిస్థితి తిరగబడింది. తమిళనాట మరోసారి అమ్మకు అధికారం కట్టబెడుతున్నారు తమిళ ఓటర్లు కాగా ఈ ఎన్నికల్లో ముందు బీరాలకు పోయిన చాలా మంది కనీసం కనుచూపు మేరలో పోటీలో నిలవలేదు. ముందు నుండి తన పార్టీ ఏకంగా అధికారాన్ని పొందుతుంది అని అనుకున్న విజయ్ కాంత్ పార్టీ పోటీ మొదలు కాక ముందే చేతులెత్తింది. పొత్తులు పెట్టుకునేందుకు పెద్ద పార్టీలురావడంతో తమిళనాట.. ట్రెండ్ సెటర్ గా మారిన విజయ్ కాంత్ కు ఘోర పరాజయం వరించింది.

ఇక కేరళలోని తిరువనంతపురంలో బిజెపి పార్టీ తరఫున పోటీకి దిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ గాలికి కొట్టుకుపోయారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కానీ తిరువనంతపురం వాళ్లు మాత్రం శ్రీశాంత్ కు అవకాశం ఇవ్వలేదు. బీజేపీ పక్షాన పోటీ చేసిన మరో ప్రముఖ బీజేపీ నేత రాజశేఖరన్ ఓటమి పాలయ్యారు.  కేరళలో యూడీఎఫ్ పార్టీ అభ్యర్థి మణి సైతం ఓటమి పాలయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో . పీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన అను్బమణి రాందాస్ సైతం ఓటమి చవిచూశారు. తమిళనాడు నుంచి పోటీ చేసిన మరో ప్రముఖ నటుడు శరత్ కుమార్ సైతం ఓడిపోయారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పక్షాన హౌరా నార్త్ నుంచి పోటీ చేసిన మరో ప్రముఖురాలు రూపాగంగూలి సైతం మమత ప్రభంజనంలో  ఓటమి పాలయ్యారు. పశ్చిమ బెంగాల్ లో ప్రముఖ నేతలు సూర్యకాంత్ మిశ్రా, దీపామున్షీలు సైతం ఓడిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles