మోదీకి స్వీట్ న్యూస్ | Sweet news to Narendra Modi

Sweet news to narendra modi

Narendra Modi, Modi, BJP, Congress, Assam, Kerala, Oomen Chandi; Elections, Election Results, Polls results 2016, ఎలక్షన్ రిజల్ట్స్, ఎన్నికల ఫలితాలు, మోదీ, బిజెపి, కాంగ్రెస్

PM Narendra Modi getting sweet news from Elections results. BJP Party getting Assam in this Elections. But Congress mostly loosing Kerala.

మోదీకి స్వీట్ న్యూస్

Posted: 05/19/2016 11:21 AM IST
Sweet news to narendra modi

బిజెపి పార్టీ గత ఎన్నికల్లో వికసించినప్పుడు ఎంతలా అయితే బిజెపి వర్గాలు సంబరాలు చేసుకున్నాయో ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. దాదాపుగా పట్టులేదు అన్నకన్న చోట ఆధిక్యం దిశగా బిజెపి దూసుకెళుతోంది. నేడు వస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బిజెపి పార్టీకి అసోం రాష్ట్రం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో బిజెపి లీడ్ లో కొనసాగుతుండటంతో మోదీ అండ్ కో సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఇక్కడ మోదీకి కలిసివచ్చే మరో అంశం కూడా ఉంది. అదేమిటంటే..

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లలో కాంగ్రెస్ కు, బిజెపి పార్టీలకు ముందు నుండి పట్టులేదు. ఈ ఎలక్షన్స్ లో ఆ రెండు పార్టీలు ఓడినా.. గెలిచినా కూడా పెద్దగా ఒరిగేది.. పోయేది ఏమీ ఉండదు. కానీ అదే కేరళ విషయానికి వస్తే మాత్రం సీన్ వేరేలా ఉంటుంది. కేరళలో ఉమెన్ చాంది ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కేరళలో ఈసారి అధికారం అక్కడి ఎల్డీఎఫ్ కు అదికారాన్ని కట్టబెట్టేందుకు ఓటర్లు మొగ్గుచూపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి బిజెపికి అసోం రాష్ట్రం కలిసి వస్తుంటే.. కాంగ్రెస్ కు ఓ రాష్ట్రం చేజారడం నిజంగా మోదీకి తీపి వార్తే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles