Kerala Assembly Election 2016: VS Achuthanandan says ‘If you don’t eat, you have no use for a toilet’

When you can t eat toilet not needed achuthanandan takes on pm modi

Assembly Election 2016,Kerala,Narendra Modi,Oommen Chandy,Pinarayi Vijayan,VS Achuthanandan, Thiruvananthapuram, toilet, PM Modi,

The veteran Leftist from Kerala came down heavily on PM Modi's Clean India campaign that focuses on modernising stations and building much-needed bathrooms

ప్రధానిపై వామపక్ష కురువృద్ధుడి ఘాటు విమర్శలు

Posted: 05/13/2016 07:39 PM IST
When you can t eat toilet not needed achuthanandan takes on pm modi

కేరళ సీపీఎం కురువృద్ధ నేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అభ్యర్థి వీఎస్ అచ్చుతానందన్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్రమోదీపై ఘాటు విమర్శలు చేశారు. ఎంతసేపు స్వచ్ఛ భారత్ పేరుతో దేశాన్ని స్వచ్ఛంగా తయారు చేస్తానంటున్న మోడీకి ఎక్కడికి వెళ్లినా చెత్తే కనబడుతుందా..? అని ఆయన ప్రశ్నించారు. రోజుకో పూట కూడా తినడానికి తిండి లేక, తిండి దోరకని ప్రజలు అసలు కనబడం లేదా అంటూ నిలదీశారు, అసలు తిండే దోరకనప్పుడు ఎంత పాష్ మరుగుదొడ్ల నిర్మాణం జరిగినా లాభమేముంటుందని అడిగారు.

ప్రధాని  నరేంద్ర మోదీ.. ముందు దేశంలో చాలామందికి తినడానికి తిండి కూడా లేదనే విషయం గుర్తించి వారికి తిండి కల్పించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు, ఇటీవల ఓ టీవీ చానెల్ తో మాట్లాడారు. ప్రధానంగా మోదీ కార్యక్రమాలపైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. 'అతడు (ప్రధాని నరేంద్రమోదీ) ఎంతసేపు ప్రతి భారతీయుడికి శౌచాలయ్.. శౌచాలయ్.. శౌచాలయ్ అని పాడుతున్నారు. కానీ, తినడానికి తిండే లేనప్పుడు వాళ్లు ఆ శౌచాలయాన్ని ఎలా ఉపయోగించుకుంటారు' అని ఆయన ప్రశ్నించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles