Actress alleges that her clothes were ripped off during shoot

Actress stripped during film shoot

Actress Stripped During Film Shoot, Malayalam director Snehajith, Daivam Sakshi, Thoduphuzha, Kerala, malayalam actress stripped, actress, clothes ripped off, Women’s Cell, Thodupuzha police station, Kaliyaar police

A police complaint has been filed against Malayalam director Snehajith, for allegedly ripping off the clothes of an actress in front of the film crew

మళయాళ నటిని వివస్త్రను చేయించిన దర్శకుడు..

Posted: 05/13/2016 08:13 PM IST
Actress stripped during film shoot

సినిమాలలో కొంత మంది హీరోయిన్ల వేషాధారణ చూసి మనం అసహించుకుంటాం. ఎందుకిలా డబ్బుల కోసం దిగజారీపోతున్నారని చర్చిస్తుంటాం. పలు సందర్భాల్లో నటీమణులు వేసుకునే వస్త్రాధారణతో పాటు వారు అభినయించే పాత్రలను కూడా ప్రేక్షకులకు ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే వాటిని నటీమణులు మాత్రం ఒక్కటే మాటలో కొట్టిపారేస్తుంటారు, పాత్రకు తగ్గవిధంగా తాము అభినయించామంటారు, మీరు అసహించుకునే స్థాయిలో నటించామంటే అది తమ నటన వల్లేనంటారు. ఇక మరికోందరైతే రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరని చెప్పకనే చెబుతూ అందరి నోళ్లకు తాళాలు వేయించాలని ప్రయత్నిస్తారు.

ఇది రమారమి అలాంటి వార్తే. రియల్ లైఫ్ కు రీల్ లైఫ్ కు తేడా తెలియని ఓ నటీమణి తనకు ఎదురైన దారుణ ఘటనను జీర్ణించుకోలేక ఏకంగా పోలిస్ స్టేషన్ మెట్లెక్కింది. సినిమా షూటింగ్ పేరుతో తన వంటిపైనున్న వస్త్రాలను బలవంతంగా విప్పించిన వైఖరిపై అమె చిత్ర దర్శకుడు న్నేహజిత్ పై పోలీసులకు పిర్యాదు చేసింది. తొడుపుళ అనే ప్రాంతంలో ఈ  దైవం సాక్షి అనే సినిమా షూటింగ్ లో నటిస్తున్న తనపై సినిమా షూటింగ్ సభ్యులందరూ చూస్తుండగా, అందిరి మధ్య తన వలువలను విప్పించారని ఆ నటి పిర్యాదులో పేర్కోంది.

తనకు ఏ మాత్రం సమాచారం చిత్రంలో తన వస్త్రాలను విప్పించే సీన్ పెట్టారని, దానిని తక్షణం తొలగించాలని కూడా నటి పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోంది. తాను ఈ చిత్రాన్ని అంగీకరించిన సమయంలో కానీ లేక ఆ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ సందర్భంలో కానీ.. తన వస్త్రాలను విప్పిస్తారన్న సమాచారం అందించలేదని అమె పిర్యాదులో తెలిపింది. తనను షూటింగ్ స్పాట్ లో అర్థనగ్నంగా ఉంచేందుకు కారణమైన దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని అమె డిమాండ్ చేసింది. కేరళ తిరువనంతపురంలోని వుమెన్స్ సెల్ పోలీసులు అమె పిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  Stripped  Snehajith  Daivam Sakshi  Thoduphuzha  Kerala  

Other Articles