Twitter reacts to Subramanian Swamy's 'Rajan unfit for RBI governor' jibe

Send raghuram rajan back to chicago says subramanian swamy

Subramanian Swamy, Raghuram Rajan, Reserve Bank of India, RBI Governor, Inflation, interest rates, raised interest rates, chicago, Subramanian Swamy, BJP, Parliament, Bharatiya Janata Party,

RBI governor as not quite the right person to hold such an important post, the BJP's newest Rajya Sabha member Subramanian Swamy said Raghuram Rajan should be sent back to Chicago

రాజన్ చికాగోకు.. స్వామి సోమాలియాకు.. నెట్ జనుల వ్యంగ్యం..

Posted: 05/12/2016 07:02 PM IST
Send raghuram rajan back to chicago says subramanian swamy

రాజ్యసభలోకి వచ్చీరాగానే విపక్షాలపై విరుచుకుపడిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వాటిపై అరోపణ పర్వానికి తెరలేపుతూ.. చివరాఖరకు సభ చైర్మన్ తో చివాట్లు తిన్నా.. తన ధోరణిలో ఎలాంటి మార్పు లేదని రుజువుచేసుకున్నాడు. తాజాగా  తన దాడిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  గవర్నర్ రఘురామ రాజన్ పై ఎక్కుపెట్టారు. ప్రపంచ దేశాలు అర్థికమాంద్యాలను ఎదుర్కోన్న.. మన అర్థిన పరిస్థితి మాత్రం చెక్కు చెదరకుండా అలాగే తటస్థంగా కొనసాగేందుకు కారణమైన రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ రాజన్ ను ఆయన టార్గెట్ చేశారు.

రాజకీయ నాయకులు ఇప్పటివరకు తమ ప్రత్యర్థులపై ఎక్కుపెట్టారే కానీ.. తొలిసారిగా సుబ్రహ్మణ్యస్వామి మాత్రం అధికార యంత్రాంగంపైన విమర్శలు గుప్పించారు. మన దేశ ఆర్థక వ్యవస్థపై అంధుల రాజ్యంలో ఒంటి కన్ను వ్యక్తి రాజుగా వున్నట్లని కామెంట్ చేసిన ప్రతిఫలమేమో కానీ.. ఇప్పుడాయన ఏకంగా బీజేపి ఎంపీలకు టార్గెట్ గా మారారు. దేశ ఆర్థిక పరిస్థితి కోసం ఉన్నత స్థాయిలో వున్నఅధికారులతో రహస్యంగా చర్చలు జరిపి.. వారిపై చర్యలు తీసుకునే ప్రభుత్వాలను చూసిన భారతావని ఏకంగా ఇప్పుడు వారిన ప్రభుత్వాలు, పాలకులు టార్గెట్ చేయడం మాత్రం ఇదే తొలిసారి.

దేశం ఆర్థికపురోగతి సాధించాలని చిత్తశుధ్ది వుంటే ఫలానా చర్యలు తీసుకోవాలని సూచించాలని కానీ, ప్రతీ ఒక్కరని విమర్శించడంతో ద్వారా బీజేపి ప్రభుత్వం ఏం సాధిస్తుందో మాత్రం అర్థకావడం లేదు. రఘరామ్ రాజన్ పై ఎంతటి దారుణమైన విమర్శలకు సుబ్రహ్మణ్యస్వామి దిగారంటే ఆయన మనదేశానికి అనుకూలుడు కాదనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన  ఆయన.. ఆర్బీఐ గవర్నర్ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపై మండిపడ్డారు.  

రఘురామ్ రాజన్ తప్పుడు విధానాలవల్లే దేశంలో నిరుద్యోగం పెరుగుదలకు దారితీసిందని ఆరోపించి.. ప్రభుత్వ తీసుకోవాల్సిన చర్యలను ఆయనపై నెట్టే ప్రయత్నం చేశారు.  ప్రభుత్వం  తక్షణమే అతణ్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రాజన్ తీసుకుంటున్న చర్యల  మూలంగా  ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని స్వామి విమర్శించారు.  వడ్డీరేట్లు పెంచాలనే యోచన సరైంది కాదని,  ఆ ఫలితాన్ని దేశం అనుభవిస్తోందని పేర్కొన్నారు.   రాజన్ కు  సెలవిచ్చి, ఎంత తొందరగా చికాగో పంపిస్తే అంత మంచిదంటూ స్వామి  తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక సుబ్రహ్మణ్యస్వామి కామెంట్లపై అటు ట్విట్టరైట్లు కూడా తీవ్రస్థాయిలోనే స్పందించారు. రఘురామ్ రాజన్ దేశ అర్ధికాభివృద్దిని అడ్డకుంటున్నాడని, తమకు అనుకూలంగా లేదని అందుకనే గజేంద్ర చౌహాన్ ను ఆ పదవిలోకి తీసుకువచ్చి ఆర్తిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు స్వామి యత్నిస్తున్నారని మండిపడ్డారు. హార్డ్వడ్ యూనివర్శిటీ నుంచి వచ్చన అర్థికవేత్త దేశ అర్థిక వ్యవస్థకు, దేశానికి పనికి రాడా..? స్వామి లాంటి నేతలను ఎవరూ పట్టించుకోరని, కానీ వారు వార్తల్లో వుండేందుకు నిత్యం ఏదో కామెంట్లు చే్స్తుంటారని, స్వామినిలాంటి వారికి భారత్ పనికి రాదని, సోమాలియా కరెక్టు దేశమని ట్విట్టరైట్లు మండిపడుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  RangaRajan  raised interest rates  chicago  Subramanian Swamy  BJP  RBI Governor  

Other Articles