Turkish father sparks fury after filming himself teaching his young boy how to use a PISTOL

Proud turkish dad teaching his son how to shoot a handgun

Proud Turkish dad teaching son shoot handgun, Dad, teaching, son, shoot, handgun,Turkish father, north-west Turkey, Korfez, north-western region of Marmara, heated online debate

A video, shared by the father himself, shows him teaching his young son how to shoot a handgun in north-west Turkey.

ITEMVIDEOS: ఐదేళ్ల బుడతడికి తుపాకీ కాల్చడం నేర్పిన తండ్రీ..

Posted: 05/12/2016 08:34 PM IST
Proud turkish dad teaching his son how to shoot a handgun

పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు తల్లిదండ్రుల వేలు పట్టుకుని నడుస్తారు. నడక, నడత రెండూ నాన్న దగ్గరే చాలామంది నేర్చుకుంటారు. ఆ తండ్రి ఏం నేర్పితే పిల్లలు అదే నేర్చుకుంటారు. వారిని సన్మార్గంలో నడిపించడానికి అప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పిస్తుంటారు. వారు వేసే ప్రతీ అడుగును గమనిస్తుంటారు. వారె ఎక్కడైనా బాలెన్స్ తప్పుతున్నారా అని.. అదే పనిగా పరిశీలిస్తుంటారు. అలాంటిది జరుగుతుందనుకున్న సమయంలో వారు ప్రమాదపుటంచున నిలబడి వారిని మాత్రం సురక్షితంగా వుంచుతారు. అదే తండ్రి బాధ్యతగా బావిస్తారు.

కానీ అలాంటి తండ్రి.. పిల్లాడి వేలు పట్టుకుని తుపాకి కాల్చడం ఎలాగో నేర్పిస్తే!! అవును.. టర్కీలో సరిగ్గా ఇలాగే జరిగింది. పూర్తిగా లోడ్ చేసిన ఒక పిస్టల్ తీసుకుని, దాన్ని ఎలా కాల్చాలో తన ఐదేళ్ల కొడుకుకు నేర్పిస్తున్న తండ్రి ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైపెచ్చు ఆ వీడియోను ఆ తండ్రే స్వయంగా షేర్ చేశాడు. తుపాకి కాల్చడం ఎలాగో చెప్పడానికి ముందు దాన్ని లోడ్ చేసి, ఐదేళ్ల కొడుక్కి దాన్ని పట్టుకొమ్మని చెప్పాడు. 'నువ్వు నాన్న కొడుకువేనని చూపించు' అని చెప్పాడు.

రెండు చేతులతో తుపాకి ఎలా పట్టుకోవాలో అతడు చెప్పిన తర్వాత.. పిల్లాడు నెమ్మదిగా దాన్ని పైకెత్తి, ఐదుసార్లు కాల్చడం వీడియోలో కనిపిస్తుంది. ప్రతిసారీ ట్రిగ్గర్ నొక్కు.. అంటూ పిల్లాడికి సూచనలు ఇస్తుంటాడా తండ్రి. మ్యాగజైన్ మొత్తం ఖాళీ అయ్యాక 'వీడు సరైన మగాడు.. ఇది ఆడవాళ్లకు గుణపాఠం కావాలి' అని చెబుతాడు. ఈ మొత్తం వీడియోను షూట్ చేసిన వ్యక్తి కూడా ఆ తర్వాత పిల్లాడిని అభినందిస్తాడు. దీనిపై టర్కీలో ఇప్పుడు వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : father teaching  pistol using  turkey father  

Other Articles