పోలీసలుకే షాకిచ్చిన సెక్స్ రాకెట్ | Police also shocks with Banglore Prostitution racket

Police also shocks with banglore prostitution racket

Banglore, Bangalore, Racket, Business, Prostitution, Crime Branch, Police, బెంగళూరు, క్రైం బ్రాంచ్, వ్యభిచారం

Banglore Crime Branch Police busted Prostituion. They shocks after facts about how they are running prostitution business.

పోలీసులకే షాకిచ్చిన సెక్స్ రాకెట్

Posted: 05/10/2016 04:54 PM IST
Police also shocks with banglore prostitution racket

బెంగళూరులోని ఒక త్రీ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ ను పోలీసులు చేధించారు. నగరంలోని ఎన్ టీ పెటెలోని క్రైం బ్రాంచ్ హెడ్ క్వార్టర్ కు కూతవేటు దూరంలో ఉన్న శివ ప్యాలెస్ అనే త్రీ స్టార్ హోటల్ ఉంది. అందులో హైటెక్ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం పోలీసులకు తరచూ అందేది. హుటాహుటిన హోటల్ కి వెళ్లటం.. హోటల్ ని అణువణువు గాలించటం.. ఉత్త చేతులతో తిరిగి రావటం పోలీసులకు ఒక అలవాటుగా మారింది. తమకు అందే సమచారం సరికాదా? లేక.. హోటలోడు తెలివిగా వ్యవహరిస్తున్నాడా? అన్నది అర్థం కాని పజిల్ గా ఉండేది.

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేయటానికి పోలీసులు ఆరుసార్లు తనిఖీ చేసినా.. ఎలాంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులకు మా చెడ్డ ఇబ్బందిగా ఉండేది. తాజాగా మరోసారి సమాచారం అందటం.. ఈసారి ఎలా అయినా హోటల్లోని నిర్వహించే సెక్స్ రాకెట్ అంతు చూడాలని డిసైడ్ అయిన పోలీసులు.. హోటల్ కు వెళ్లారు. ఎప్పటిమాదిరే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తనిఖీకి వెళ్లిన పోలీస్ ఇన్ స్పెక్టర్ ఒకరు హోటల్ గోడల్ని నిశితంగా పరిశీలించాలన్న ఆలోచన రావటం.. హోటల్ లోని ప్రతి గోడను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మొదటి అంతస్తుకు.. రెండో అంతస్తుకు మధ్యన ఒక రహస్య అంతస్తును హోటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ రహస్య ఫ్లోర్ బయటకు ఏ మాత్రం కనిపించదు. గోడలో భాగంగా ఏర్పాటు చేసిన డోర్ ను గుర్తించిన పోలీసులు.. గోడను బద్ధలు కొట్టి లోపలకు ప్రవేశిస్తే.. అసలు విషయం బయటపడింది.

రహస్య డోర్ లో నుంచి లోపలకు వెళ్లిన పోలీసులకు అక్కడ ఏకంగా ఒక ఫ్లోర్ ఉండటం.. అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు ఉండటంతో పోలీసులు కంగు తిన్నారు. ఈ రహస్య ఫ్లోర్ కు.. బెల్ ఒకటి ఏర్పాటు చేసిన హోటల్ నిర్వాహకుడు పోలీసులు తనిఖీకి వచ్చినప్పుడు ఆ బెల్ తో హెచ్చరించేవాడన్న విషయం బయటకు వచ్చింది. పోలీసు అధికారులు స్మార్ట్ గా రియాక్ట్ కావటంతో హైటెక్ వ్యభిచారాన్ని తెలివిగా నిర్వహిస్తున్న శివప్యాలెస్ డీలక్స్ లాడ్జ్ యవ్వారం బయటపడినట్లైంది. ఈ హోటల్ వ్యవహారం పోలీసు వర్గాల్లోనే కాదు.. స్థానికంగా సంచలనంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles