ఉత్తరాఖండ్ లో గెలిచిన హరీష్ రావత్ | Harish Rawat won the Uttarakhand floor test

Harish rawat won the uttarakhand floor test

UttaraKhand, Harish Rawat, Floor Test, BJP, President Rule, ఉత్తరాఖండ్, హరీష్ రావత్, రాష్ట్రపతి పాలన

The Uttarakhand Assembly took a floor test of former chief minister Harish Rawat’s government on Tuesday, and according to reports on various news channels, Rawat has won the trust vote. The Supreme Court of India will declare the official result on Wednesday.It was an unprecedented vote in that it is being directly supervised by the Supreme Court.

ఉత్తరాఖండ్ లో గెలిచిన హరీష్ రావత్

Posted: 05/10/2016 04:26 PM IST
Harish rawat won the uttarakhand floor test

ఉత్తరాఖండ్ అసెంబ్లీ బలపరీక్షలో సీఎం హరీష్ రావత్ విజయం సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్రంలో తాత్కాలికంగా రాష్ట్రపతిపాలన ఎత్తివేసి ఈ ఉదయం ఉదయం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో హరీష్ రావత్‌కు 34 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయగా.. మిగిలిన 28 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు సమాచారం. మొత్తం 70 మంది సభ్యులు గల ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాలు కూడా సమర్థించారు. దీంతో రెబల్ ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఫైనల్ గా తో హరీష్ రావత్ తన 27 ఎమ్మెల్యలతో పాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, మిగిలిన ఐదుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొని బలనిరూపణ పరీక్ష లో నెగ్గారు. అయితే బలనిరూపణ ఫలితాలు అధికారికంగా ఇంకా వెలువడలేదు. బల పరీక్షకు సంబంధించిన ఫలితాల వివరాలను అసెంబ్లీ స్పీకర్.. సీల్ట్ కవర్ లో సుప్రీంకోర్టుకు పంపించారు. బుధవారం సుప్రీంకోర్టు దీన్ని అధికారికంగా ప్రకటించనుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి కాగానే అక్కడ రాష్ట్రపతి పాలన రద్దవుతుంది. ఇదిలా ఉండగా తాజా పరిణామం మోడీ సర్కార్ పెద్ద ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చిందనే అపవాదు బీజేపీ మూటగట్టుకుందని మేధావులు అభిప్రాయడపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles