మందేసినా.. సిగరెట్ తాగినా ఓటు హక్కు ఉండదు | You will loose your Vote if u drink Liquor

You will loose your vote if u drink liquor

Chandigarh, Voting, Vote, Guru Dwara, గురుద్వారా, సిక్కులు, ఛండీఘర్

In Chandigarh, Sikh Gurudwara got new rule for Voting. Parliament pass a new GO for Voting in Gurudwara eletions.

మందేసినా.. సిగరెట్ తాగినా ఓటు హక్కు ఉండదు

Posted: 05/09/2016 08:07 AM IST
You will loose your vote if u drink liquor

ఇదేదో మన దేశంలో కాదు లెండి అని అనుకుంటున్నారేమో కానీ ఇది మన దేశంలోనే. అది కూడా పార్లమెంట్ ద్వారా బిల్లు రూపంలో వచ్చింది. ఓటు వెయ్యాలంటే వయస్సు ఎలా ఉండాలో... అలాగే ఓటును తీసి వెయ్యడానికి కూడా కొన్ని కండీషన్స్ ను పెడుతూ తాజాగా పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. చండీగఢ్ లోని సిక్కుల గురుద్వారాలకు జరిగే ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులు కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించకపోతే ఆ సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోతారు. ది సిక్ గురుద్వారాస్ (సవరణ) చట్టం 2016 ప్రకారం తమ జుట్టును, గడ్డాన్ని ట్రిమ్ చేసుకోవడంగానీ, షేవ్ చేసుకోవడంగానీ ఎవరు చేస్తారో, అలాగే మద్యం తాగడం, పొగ తాగడంలాంటివి చేస్తారో వారికి గురుద్వారాలకు జరిగే ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉండదు.

ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేసి ఆమోదించగా దానికి రాష్ట్రపతి సమ్మతి తెలిపారు. గతంలోని 1925 నాటి గురుద్వారా చట్టం ప్రకారం 21 ఏళ్లు దాటిన ప్రతి సిక్కు యువకుడు ఆయా గురుద్వారాలకు నియమించే పరిపాలన, నిర్వహణ యంత్రాంగాలను (శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ-ఎస్ జీపీసీ) ఎన్నుకునేందుకు ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, గతంలో పైన పేర్కొన్న నిబంధనలు ఉండేవి కావు. తర్వాత కాలంలో ఆ కమ్యూనిటీ నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ఏడాది మార్చి 15న ఈ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్-నాధ్ సింగ్ సభలో ప్రవేశపెట్టారు. మరుసటి రోజే ఆ బిల్లు ఆమోదం పొందింది. దానికి తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles