YSRCP facing troubles in Godavari Dists

Ysrcp facing troubles in godavari dists

AP, chandrababu, Kothapalli subharayudu, ఏపీ, కొత్తప‌ల్లి సుబ్బారాయుడు, టీడీపీ

YSRCP facing troubles in AP with Telugudesam party. TDP encouring YSRCP leaders to join TDP.

గోదావరి జిల్లాల్లో వైసీపీకి షాక్

Posted: 05/09/2016 11:34 AM IST
Ysrcp facing troubles in godavari dists

ఏపిలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. టీడీపీ ఇస్తున్న షాకులతో ఇప్పటికే కుదేలైన ఆ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. వైకాపా ను వీడి టీడీపీ చేరుతున్న ఎమ్మెల్యే సంఖ్య ప‌ల‌చ‌బ‌డ‌టంతో ఈ గ్యాప్‌లో నాన్ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్లను పార్టీలోకి తీసుకోవాల‌ని భావిస్తున్న టీడీపీకి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైకాపా అధ్యక్షుడు కొత్తప‌ల్లి సుబ్బారాయుడు నుంచి గ్రీన్ సిగ్నిల్ వ‌చ్చిన‌ట్లు ఉంది. ఇప్పటికే రాయలసీమలో మేజర్ వైసీపీ క్యాడర్ ను లాగేసిన టీడీపీ ఇప్పుడు గోదావరి జిల్లాల్లో వైసీపీ పార్టీ నుండి తమ పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తోంది.

వైకాపాను బ‌ల‌హీన ప‌ర్చి 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్ష విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని భావిస్తున్న టీడీపీ దానికి అనుగుణంగానే పావులు క‌దుపుతున్నారు. ఇంత కాలం ఎమ్మెల్యేల‌పే దృష్టి సారించారు. ఇప్పుడు రెండో శ్రేణి నేత‌లకు కూడా ఆక‌ర్ష ప‌థ‌కాన్ని విస్తరించారు. ఆ విస్తర‌ణ కార్యక్రమంలో ఇంకా అనేక మంది పేర్లు విన్పిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విదేశి ప‌ర్యట‌న ముగించుకుని తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కొత్తప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నార‌ని తెలుస్తోంది. కొత్తపల్లి చేరికకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆయనకు నచ్చిన పార్టీలో చేరే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles