mp mekapati raja mohan reddy critisizes centre and state governments on ap special status

Cine actor shivaji critisizes andhra pradesh bjp leaders on ap special status

Andhra Pradesh Reorganisation Act, lack of quorum, Haribhai Parthibhai Chaudhary, K V P Ramachandra Rao, K Keshava Rao, Parliamentary Affairs Mukhtar Abbas Naqvi, neethi ayog, special status, mekapati rajamohan reddy, shivaji

mp mekapati raja mohan reddy and cine actor shivaji critisizes centre and state governments and bjp leadets on ap special status

ప్రత్యేక హోదా లేనట్టే.. విన్నారా బీజేపి సన్నాసుల్లారా: శివాజీ మండిపాటు

Posted: 04/29/2016 07:56 PM IST
Cine actor shivaji critisizes andhra pradesh bjp leaders on ap special status

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రమంత్రి హెచ్‌బీ చౌదరి చెప్పడం ఏమాత్రం సబబు కాదని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పెషల్‌ స్టేటస్‌పై రాజ్యసభలో మాటిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు, రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌లో పొందు పర్చలేదని చెప్పడం పద్ధతి కాదని మేకపాటి అన్నారు. పునర్విజన బిల్లులో ఆ అంశాన్ని పోందుపర్చలేదని చెబుతున్న బీజేపి నేతలు అప్పుడు రాష్ట్రానిక ప్రత్యేక హాదా కావాలంటే తమకు ఓటు వేయాలని ఎన్నికలలో ఎలా ప్రచారం చేశారని ఆయన నిలదీశారు, ప్రత్యేకహోదాపై కేంద్రం మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే ఏపీకి నష్టం జరుగుతోందని మేకపాటి అన్నారు.

కేంద్ర మంత్రి హెచ్ బి చౌదరి ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందేనని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి పేర్కొన్న విషయమౌ ఆయన స్పందిస్తూ, తెలుగు కేంద్ర మంత్రులు కేంద్రంలో కార్పొరేట్ పైరవీల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కేంద్రమంత్రులకు సన్మానం చేయాలంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆ తరువాత ఓ టీవీ ఛానెల్ తో ఫోన్ లో సంభాషించిన ఆయన రాష్ట్ర బీజేపి నేతలను సన్నాసులని తిట్టేసారు.

ఇవాళ ఈ విషయమై చూడాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్య వైఖరి వల్లే పరిస్థితి ఇలా తయారైందని ఆయన విమర్శించారు. ‘అమ్మ పెట్టదు, అడక్కుతిననివ్వదని’. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల ఎలా వ్యవహరిస్తున్నదీ సాక్షాత్తూ ప్రభుత్వంమే చెప్పింది. ఇవాళ, సన్నాసి మంత్రెవడో ఒకడు చెప్పాడని చెప్పి, ఆ వెధవకు తెలియదేమో.. 14వ ఆర్థిక సంఘం.. బీజేపీ సన్నాసుల్లారా ఒకసారి వినండి..14వ ఆర్థిక సంఘం బీహార్ కు లక్షా అరవై వేల కోట్లు ఇవ్వమందా సన్నాసుల్లారా? మీరు మనుషులేనా?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు నోరుమెదపట్లేదు’ అని నాటి విషయాలను హీరో శివాజీ ప్రస్తావించారు.

ఏపీకి ప్రత్యేకహోదా విషయమై వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ట్రానికి చెందిన మిగిలిన బీజేపీ నేతలు, మంత్రులు అసలు ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ‘మనసువిప్పి పోరాటానికి సిద్ధంకండి, ప్రత్యేకహోదా ఎందుకు రాదో తేలుద్దాము. ప్రత్యేకహోదాపై నోటిమాట కన్నా బిల్లులో పెట్టేసి ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదు కదా? ఏపీ ప్రత్యేక హోదాపై ఒక్క చంద్రబాబు నాయుడు తప్పా, మిగిలిన మంత్రులెవ్వరూ మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోండి. ఏపీ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు వాళ్ల వ్యాపారాలు, లావాదేవీలు తప్పా ఏపీ ప్రజల గోడు పట్టించుకోవట్లేదు’ అని శివాజీ మండిపడ్డారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles