పెళ్లైన మూడు గంటలకే.. | It Happen Within three hours After marriage

It happen within three hours after marriage

Bridegroom, Karnataka, Ballary, పెళ్లి కొడుకు, బళ్లారి, కర్ణాటక

Bridegroom in karnataka ballary, dead with in three hous after his marriage. Bridegroom dead with heart attack.

పెళ్లైన మూడు గంటలకే..

Posted: 04/27/2016 01:49 PM IST
It happen within three hours after marriage

పచ్చటి తోరణం.. చుట్టూ బంధువులు.. అంతా సందడిగా ఉంది. పెళ్లి కూతురు బంధువులు, పెళ్లి కొడుకు బంధువులు,  నూతన వధూవరులను ఆశిర్వదించడానికి వచ్చిన శ్రేయోభిలాషులతో కిటికిటలాడుతోంది. ఎలాంటి అడ్డులు, ఆటంకాలు లేకుండా ముందే అనుకున్న శుభముహూర్తాన పెళ్లి బాజాలు మోగాయి. సాఫీగా పెళ్లితంతు ముగిసింది. పెళ్లికి వచ్చిన అతిథులు అక్కడ ఏర్పాటు చేసిన విందును కడుపార తిని ముచ్చట్లు చెప్పుకొని తీరిగ్గా వెళ్లి పోయారు. అలా వెళ్లిన కొంత టైంకి ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. పెళ్లైన మూడు గంటలకే అలా జరిగిందని అవాక్కయ్యారు.

కర్ణాటక బళ్లారిజిల్లాలోని కొట్టూరు పట్టణంలో చోటుచేసుకొంది. బంధువుల వివరాల మేరకు బళ్లారిజిల్లా కొట్టూరు పట్టణానికి కొట్రేష్‌ కు ఆయన అక్కకూతురితోనే వివాహం జరిపించారు. పెళ్లి తంతు అంతా ముగింపు దశకు చేరుకున్న తరుణంలో.. అప్పగింతల కార్యక్రమం ప్రారంభం అవుతున్న సమయంలో వరుడు కొట్రేషకు గుండెనొప్పితో చనిపోయాడు.  దీంతో వధువుతో పాటు బంధువులు, గ్రామప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి కోసం కట్టిన పచ్చని తోరణాలు వాడిపోక ముందే నిండు జీవితం ముగిసిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles