ప్లీనరీలో కేసీఆర్ పద్యం | KCR told a rhyme in TRS plenary

Kcr told a rhyme in trs plenary

TRS, KCR, Khammam, plenary, Telangana, కేసీఆర్, వేమన, ప్లీనరీ, ఖమ్మం

Telangana CM KCR told a rhyme in TRS Plenary at Khammam. He told Vemana sentences on plenary stage.

ప్లీనరీలో కేసీఆర్ పద్యం

Posted: 04/27/2016 03:07 PM IST
Kcr told a rhyme in trs plenary

పనులు ప్రారంభించక ముందే ఏం జరగుతుందో నన్న భయంతో...గొప్ప పనులు నీచ మాన‌వులు ప్రారంభింప‌బోరన్నారు సీఎం కేసీఆర్. ధైర్యం ఉన్నవారే గొప్పప‌నులు ఆరంభించి ఫ‌లితాలను అందించిపుచ్చుకుంటారని అన్నారు. "ఆరంభింప‌రు నీచ మాన‌వులు" అనే ప‌ద్యంతో కేసీఆర్‌ ప్లీన‌రీలో త‌న ప్రసంగాన్ని మొద‌లుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న దిశ‌గా టీఆర్ఎస్‌ని ప్రారంభించామ‌ని, అన్ని అవ‌రోధాల‌ను అధిరోహించి తెలంగాణ‌ను సాధించామ‌ని పార్టీ కార్యకర్తల‌ను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారు ప్లీన‌రీ స‌భ‌లో ఉన్నార‌ని, రాష్ట్ర సాధ‌న ఘ‌న‌త కార్యక‌ర్తలకు ద‌క్కుతుంద‌ని చెప్పారు.

టీఆర్ఎస్‌ అంటే ముందుగా గుర్తు కొచ్చేది కేసీఆర్.. త‌రువాత ఆ పార్టీ శ్రేణుల‌ని అన్నారు. మనం చేసిన ఉద్యమం... పార్టీ కార్యక‌ర్తలు చేసిన కృషి... తెలంగాణ చ‌రిత్రలో నిలిచిపోతుందన్నారు. నాటి ఉద్యమ పార్టీ..నేడు రాజకీయ పార్టీగా మారిందని, బంగారు తెలంగాణ నిర్మాణం కూడా మ‌న‌మే తీసుకోవాల‌ని నిర్ణయం తీసుకొని ఎన్నిక‌ల్లోకి దిగామ‌ని కార్యక‌ర్తల‌ను ఉద్దేశించి అన్నారు. మనకు గర్వం పనికిరాదు, అపజయాన్ని చూసి కుంగిపోవద్దు. జయాన్ని చూసి పొంగిపోవద్దు అని హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  KCR  Khammam  plenary  Telangana  కేసీఆర్  వేమన  ప్లీనరీ  ఖమ్మం  

Other Articles