ఏపిలో .జనసేన మరోప్రస్థానం | Janasena got political party status in AP

Janasena got political party status in ap

janasena, Pawan Kalyan, Power Star pawan kalyan, janasena party, Election Commission, AP, Janasena Leaders, పవన్ కళ్యాణ్, జనసేన, ఏపి, ఎన్నికల సంఘం

Election commission gave recognisation in AP to Janasea, Pawan kalyans janasena requested to treat and give recongnisations for Political Party Status.

ఏపిలో .జనసేన మరోప్రస్థానం

Posted: 04/26/2016 11:20 AM IST
Janasena got political party status in ap

పవర్ స్టార్ గా తెలుగు సినిమాలో వెలుగు వెలుగుతున్న పవన్ కళ్యాణ్ స్థాపించిన .జనసేన పార్టీకి, పార్టీ అభిమానులకు తీపి కబురు అందింది. జనసేన పార్టీకి రాజకీయ పార్టీ హోదా ఇస్తూ ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. ఇదువరకే తెలంగాణలో జనసేన కు రాజకీయ పార్టీ గుర్తింపురాగా తాజాగా ఏపిలో కూడా ఆ గుర్తింపు వచ్చింది. దీనికి సంబందించిన పత్రాలను జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు పంపించినట్లు తెలుస్తోంది. అవే పత్రాలను పవన్ తో పాటుగా అన్ని జిలల్ాల కలెక్టర్లకు, రిటర్నింగ్ అధికారులకు కూడా ఎన్నికల సంఘం పంపించింది.

కాగా ప్రస్తుతానికి ఎన్నికల సంఘం ఎలాంటి గుర్తును కేటాయించలేదు. కానీ ఎన్నికల్లో పాల్గొనే సమయంలో స్వతంత్ర అభ్యర్థుల కన్నా కూడా మెరుగైన గుర్తును తమ ఎన్నికల గుర్తుగా ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2014లో తమ పార్టీని పొలిటికల్ పార్టీగా గుర్తించాలని పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. కాగా దాని మీద విస్రృతంగా పరిశీలించిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు జనసేనకు ఏఫిలో రాజకీయ పార్టీ హోదాను ప్రకటించేసింది. ఇక మీదట తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీగా జనసేన నుండి ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చెయ్యవచ్చు.  దీంతో అటు పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఫుల్ ఖుషిగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles