CJI takes a dig at PM Modi: ‘We work during break, not just go to Manali’

We do not go to manali says chief justice retorts after pm suggestion

cji breaks down, chief justice of india, judges, pm modi, cji, cji emotional, chief justice, cji thakur breaks down, ts thakur, cji thakur, modi, judges

"Nothing has moved" since 1987 when the Law Commission had recommended increase in the number of judges from then 10 judges per 10 lakh people to 50, an unusually emotional Justice Thakur said.

ప్రధాని మోడీ సెలవుల సూచనలపై సిజేఐ ఘాటు వ్యాఖ్యలు..

Posted: 04/26/2016 10:51 AM IST
We do not go to manali says chief justice retorts after pm suggestion

న్యాయవ్యవస్థ తన సెలవు దినాలను తగ్గించుకోవాలని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన సూచనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. 'మేం ఏమైనా సెలవుల్లో ఎంజాయ్ చేస్తామా? మనాలీ వంటి తదితర హిల్‌స్టేషన్లకు పోయి ఎంజాయ్ చేస్తామనుకుంటున్నారా? తీర్పులను ఎవరు రాస్తారు? ముఖ్యంగా రాజ్యాంగ ధర్మాసన తీర్పులను ఎవరు రాస్తారు? అసలు విషయం తెలుసుకోండి.. మాకు మూడు వారాలు మాత్రమే బ్రేక్ లభిస్తుంది. నా సహచరుడు (జస్టిస్ జేఎస్ ఖేహార్) బ్రేక్ సమయంలో జాతీయ న్యాయ నియామక కమిషన్ (ఎన్‌జేఏసీ)పై విచారించారు. సెలవుల సమయంలో తీర్పును రాశారు' అని చీఫ్ జస్టిస్ ఠాకూర్ చెప్పారు.

ఆదివారం ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో చీఫ్ జస్టిస్ ఠాకూర్ భావోద్వేగ ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ మీద పని భారం మోపడం సరైంది కాదని అన్నారు. అమెరికాలో ఏడాదికి ఒక న్యాయమూర్తి 81 కేసులను పరిష్కరిస్తుంటే ఇండియాలో 2,600 కేసులను పరిష్కరించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జడ్జీలు సెలవులు తగ్గించుకోవాలన్న సూచనపైనా చీఫ్ జస్టిస్‌ ఘాటూగా స్పందించి.. తాము అందరిలా సెలవులు తీసుకుని మనాలీ వంటి పర్యటక ప్రాంతాలకు వెళ్తున్నామా అని ప్రశ్నించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chief Justice  TS Thakur  supreme court  CJ of India  PM modi  reaction  modi suggestion  

Other Articles