దావూద్ రెండు కాళ్లు తీసివేస్తున్నారట | Dawood Ibrahim Crippled By Gangrene

Dawood ibrahim crippled by gangrene

Dawood Ibrahim, Pakistan, Criminal, Gangrene, దావూద్ ఇబ్రహీం, గ్యాంగ్రిన్, పాకిస్థాన్, కరాచీ

Dawood Ibrahim, India’s most wanted criminal, is suffering from severe gangrene in his legs that has left him crippled. The doctors at Liaquat National Hospital, Karachi and the Combined Military Hospital, Karachi, where the D-Company's boss is being treated, said his legs may have to be soon amputated.

దావూద్ రెండు కాళ్లు తీసివేస్తున్నారట

Posted: 04/26/2016 08:55 AM IST
Dawood ibrahim crippled by gangrene

భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్రీన్ సోకింది. దీంతో దావుద్ కదలలేని పరిస్ధితిలో ఉన్నట్లు ప్రముఖ టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. గ్యాంగ్రీన్ కారణంగా దావూద్ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. హై బీపీ, బ్లడ్ షుగర్ కారణంగా దావూద్ కాళ్లలో రక్తసరఫరా సవ్యంగా జరగటం లేదని, భవిష్యత్ లో ఆయన కాళ్లు తొలగించడం తప్ప వేరే మార్గం ఉండకపోవచ్చని దావూద్ వైద్యులు పేర్కొన్నట్లు రాసింది. దావూద్ తన క్లిఫ్టన్ నైబర్ హుడ్ రెసిడెన్స్ లో చికిత్స పొందుతున్నాడు. కరాచీలోని లియాఖత్ నేషనల్ ఆసుపత్రి, కంబైన్డ్ మిలటిరీ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందినట్లుగా ఆ న్యూస్ ఛానెల్ లో ప్రసారం చేసింది.

దావూద్ కాళ్లలోని అధిక కణజాలం ఇప్పటికే ‘డెడ్ ’ అయిందని సమాచారం. కాగా, కరాచీ నుంచి ఆయన్ని ఎక్కడికీ కదిలించకూడదని, ఆర్మీ వైద్యులే ఆయన చికిత్స నిర్వహించాలని గతంలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ప్రధాన నిందితుడు.. అతడి కోసం భారతదేశం గత కొన్ని సంవత్సరాల నుండి వెతుకుతూనే ఉంది. పాకిస్థాన్ లో దావూద్ తలదాచుకున్నాడని సమాచారం అందినా కానీ పాకిస్థాన్ మాత్రం తమ దగ్గర దావూద్ లేడని బుకాయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles