కేసీఆర్ ఇలాఖాలో చిన్నారి పెళ్లికూతుళ్లు | Child marriages in CM KCRs area

Child marriages in cm kcrs area

KCR, Telangana, Child Marriages, బాల్య వివాహాలు, కేసీఆర్, మెదక్, యునిసెఫ్

Telangana Cm KCRs area medak, many child marriages are going on. Unicef centre for economics and social services study reveals some intersting points.

కేసీఆర్ ఇలాఖాలో చిన్నారి పెళ్లికూతుళ్లు

Posted: 04/20/2016 02:51 PM IST
Child marriages in cm kcrs area

తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో బాల్య వివాహాలు జోరుగా జరుగుతున్నాయి. మెదక్ గ్రామీణ ప్రాంతాల్లో రోజుకో చిన్నారి పెళ్లి కూతురు ప్రత్యక్షమవుతోంది. గడచిన రెండు నెలల్లో అంటే ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 18 వరకు సుమారు 70 మంది చిన్నారులను చివరి క్షణంలో బాల్య వివాహాల నుంచి కాపాడారు చైల్డ్ లైన్ ప్రతినిధులు. ఈ లెక్కలు సమాచారం అందినవి మాత్రమే. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న పెళ్లిళ్లు ఇంకా ఎన్నో.

సాధారణంగా బాల్యవివాహాలు.. స్కూల్ మధ్యలో మానేసినప్పుడు.. ఉన్నత చదువులు చదివించలేనప్పుడు  ఎక్కువగా జరుగుతాయంటున్నారు చైల్డ్ లైన్ ప్రతినిధులు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కరవు కూడా బాల్యవివాహాలకు ఓ కారణమంటున్నారు. ఈ పెళ్లిళ్లకు ఊరి పెద్దలు, సర్పంచ్ లు.. అంగన్ వాడీ టీచర్లు కూడా వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు. నకిలీ వయస్సు ధ్రువీకరణ పత్రాలతో పెళ్లిళ్లు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం.. చైల్డ్ వెల్ఫేర్ బోర్డులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని…. సామాజిక కోణంలో సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. యూనిసెఫ్, సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే… బాల్యవివాహాలకు గల కారణాలను తెలుపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles