Police officer faces sack after topless selfie in patrol car with semiautomatic on her lap

Spicy cop gets sack after topless pic

patrol car,topless selfie,Mexican police,police officer,back seat,Spicy cop faces sack, Spicy cop topless pic,woman police officer,pornographic photo shoot,Spicy cop faces,police vehicle,cop faces sack,police job,official comment,mystery brunette,Nuevo León,Mexico,Cuernavaca,Michoacán,Facebook, Hector Mauro Ramos,Nildo Garcia

A policewoman in Mexico is suspended after posing for a topless selfie in her patrol car and posting the photo on Facebook.

ITEMVIDEOS:టాప్ లెస్ ఫోటోతో.. ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్న మహిళా పోలీస్

Posted: 04/20/2016 09:53 AM IST
Spicy cop gets sack after topless pic

పుర్రెకోబుద్ది జివ్హకో రుచి అని పెద్దలు చెప్పిన నానుడి. అ పుర్రెలోని బుద్ది వక్రీకరించిందో లేక తానేం ఫోర్న్ స్టార్ లకు తక్కువ కాదని భావించిందో ఏమో కానీ ఓ మహిళా పోలీసు అధికారి తన ఉద్యోగానికే ఎసరు తెచ్చుకుంది. అదేంటి మహిళా పోలీసు అధికారి కూడా లంచాలను తీసుకుని పట్టుబడిందా..? అంటే అదేం కాదు. ఏకంగా తాను చేసిన పని వల్ల అమె అటు తన పరువును పోగొట్టుకోవడంతో పాటు ఇటు తన పోలీసు అధికారి అన్న పరపతిని కూడా ఇబ్బందుల్లో పడేట్లు చేసుకుంది.

ఇంతకీ అమ చేసిన నేరమేంటి..? అమెను ఉద్యోగానికి ఎసరు తెచ్చిన పనేంటి..? అంటరా.. టాప్ లెస్ గా దిగడమే. మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా గార్సియా ఆనే మహిళ పోలీసు టాప్ లెస్ సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాం ను కిందికు దించి రొమ్ము భాగం కనబడేలా సెల్ఫీ దిగింది. అంతేకాకుండా ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఆ ఫోటోతో పాటు నిదియా గార్సియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసు అధికారిని వ్యవహారంపై నెట్ జనులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక ఉన్నతాధికారులకు విషయం తెలిసి తెలియగానే వారు ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. పోలీసు యూనిఫాంలో, పోలీసు పెట్రోలింగ్ వాహనంలో సెల్పీ తీసుకుని పోలీసు వ్యవస్థ గౌరవానికి భంగం కలిగిందని భావించిన ఉన్నతాధికారులు అమెపై కఠిన చర్యలకు కూడా ఉపక్రమించనున్నారు, అయితే విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై పరిశీలించనున్నారు.

నిదియా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఇతర సిబ్బంది కూడా పక్కనే ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. అలా చేసినందుకు తనను తానే అసహ్యించుకుంటున్నానని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నిదియా తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. తన ఇద్దరు కూతుళ్లు, భర్త, తల్లిదండ్రులు, సోదరులకు చెడ్డ పేరు తీసుకు వచ్చానని వాపోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mexican  Mexican police  topless  selfie  Facebook  Nildo Garcia  

Other Articles