పిఎఫ్ పై కేంద్రం తగ్గింది | Government rolls back restrictions on withdrawal of provident fund

Government rolls back restrictions on withdrawal of provident fund

PF, provident fund, central Govt, పిఎఫ్,. భవిష్యనిధి, దత్తాత్రేయ

Bowing to pressure from trade unions, the government has set aside the controversial provident fund (PF) withdrawal norms that had restricted complete withdrawal from PF account before the retirement age of 58 years.

పిఎఫ్ పై కేంద్రం తగ్గింది

Posted: 04/20/2016 09:05 AM IST
Government rolls back restrictions on withdrawal of provident fund

కార్మికుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది కార్మికులు బెంగళూరులో రోడ్డెక్కడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. కార్మిక సంఘాల ఒత్తిడి, తాజాగా బెంగుళూరులో కార్మికుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గింది. ఫిబ్రవరిలో రూపొందించిన ఈపీఎఫ్ కొత్త నిబంధనలను ఏప్రిల్ 30వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన గడువును జూలై 31 వరకు పొడిగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ మంగళవారం మీడియాకు వివరించారు.

అయితే ఆగస్టు 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని, దాని ప్రకారం నిర్దిష్టంగా కొన్ని అవసరాలకు ఉద్యోగులు ఈ డబ్బులను తీసుకోవచ్చునని తెలిపారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో సహా ఈ అంశంతో సంబంధం ఉన్నవారందరితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే కార్మికులు, ఉద్యోగుల తరఫున యాజమాన్యం వారి మూలవేతనంలో 3.67% చొప్పున ఈపీఎఫ్ సంస్థకు ప్రతినెలా చెల్లిస్తున్న మొత్తాన్ని ఉద్యోగుల సంక్షేమం కొరకు ఏ విధంగా సద్వినియోగపర్చవచ్చనే విషయమై సెంట్రల్‌బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles