Chandrababu Naidu Ranks Andhra Ministers

Chandrababu naidu ranks andhra ministers

chandrababu, Ranks, AP, Ministers, చంద్రబాబు, ఏపి, మంత్రులు, మంత్రులకు ర్యాంకులు, ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Chief Minister and TDP Supremo N Chandrababu Naidu, on Monday ranked his ministers based on their workmanship.As per the list prepared by trained professionals under the guidance of Chief Minister’s son and TDP national general secretary Lokesh, with the inputs provided by the intelligence officials, mining minister Peethala Sujatha has been placed at no. 1 position whereas municipal administration minister P Narayana has been reportedly given last rank (19).

పీతల సుజాత ఫస్ట్.. నారాయణ లాస్ట్

Posted: 04/19/2016 07:11 AM IST
Chandrababu naidu ranks andhra ministers

ఎప్పుడూ నెంబర్ వన్ ర్యాంకు మాదే అని చెప్పుకునే నారాయణ విద్యాసంస్థల అధినేతకు రాజకీయాల్లో మాత్రం షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు మంత్రులకు కేటాయించిన ర్యాంకుల్లో మంత్రి నారాయణకు కనీసం టాప్ టెన్ లో కూడా చోటు దక్కలేదు. అందరికంటే తక్కువగా చివరి స్థానానికి పడిపోయారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రుల ర్యాంకులు ప్రకటించారు.

పీతల సుజాతకు నెంబర్ వన్ ర్యాంకు దక్కింది. ఇసుక విధానంలో పనితీరుతో సీఎం చంద్రబాబు పీతల పని పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టిసీమ సకాలంలో పూర్తి కావడం.. పోలవరం పనులు వేగంగా జరుగుతండడంతో మంత్రి దేవినేని ఉమకు సెకండ్ ర్యాంక్ దక్కింది. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు మూడో ర్యాంకు దక్కింది. ప్రభుత్వాస్పత్రుల చుట్టూ తిరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేనికి నాలుగో ర్యాంకు దక్కింది.

పరిటాల సునీతకు 5, రావెల కిషోర్ బాబుకు 6, అచ్చెన్నాయుడుకు 7, గంటా శ్రీనివాసరావుకు 8వ ర్యాంకు దక్కాయి.కొల్లు రవీంద్రకు 9, అయ్యన్నపాత్రుడికి 10, పల్లె రఘునాథరెడ్డికి 11, మాణిక్యాలరావుకు 12, మృణాళినికి 13 ర్యాంకు దక్కగా.. మంత్రి నారాయణకు మాత్రం 18వ ర్యాంకు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles