Andhra Pradesh Inter Board Results 2016

Andhra pradesh inter board results 2016

AP, Intermediate, Inter First Year Results, ఇంటర్ ఫలితాలు, ఇంటర్మీడియట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్ 2016

Board of Intermediate Education, Andhra Pradesh was established in the year 1971 with an intention to regulate the system of Intermediate education in the state. It supervises and controls the functioning of the junior colleges and the quality of the education in the whole state. AP Inter board was formed as a separate body once the combined state was bifurcated into Telangana and Andhra Pradesh.

నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్డ్స్

Posted: 04/19/2016 09:05 AM IST
Andhra pradesh inter board results 2016

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత విద్యావ్యవస్థపై ఏపీలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇంటర్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అనుకొన్న తేదీ కంటే ఎంతో ముందుగా విడుదల చేస్తోంది. వాస్తవానికి ఈ నెల 23న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను..ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలో ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ సంవత్సరం మూల్యాంకన డీకోడింగ్‌ అంతా ఆన్‌లైన్‌లో జరగడంతో తక్కువ వ్యవధిలోనే మూల్యాంకనం పూర్తయింది. తొలిసారిగా రాష్ట్రంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకే రోజు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు గత నెల 2వ తేది నుంచి 21వతేది వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు పూర్తి భద్రతతో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1412 కేంద్రాలలో దాదాపు నాలుగు లక్షల 71 వేల మంది విద్యార్థులు ఇంటర్ ప్రధమ సంవత్సరం, 4లక్షల 29 వేల మంది విద్యార్ధులు ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. ఇవాళ విడుదలయ్యే ఫలితాల కోసం విద్యార్దులు ఆత్రృతగా ఎదురు చూస్తున్నారు.

ఇంటర్ ఫలితాల కోసం కింది వెబ్ సైట్లను చూడండి
http://bieap.gov.in/

www.bharatstudent.com

www.schools9.com

www.sakshi.com

www.eenadu.net

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles