Suspected drone hits passenger plane at London Heathrow Airport

Drone apparently crashes into plane headed to london s heathrow

British Airways flight in suspected drone strike, Drone apparently crashes into plane, Suspected drone hits passenger plane, Heathrow Airport, plane headed to London hit by drone, Heathrow, British Airways, Europe, Drone attack

A British Airways flight has been struck by a suspected drone as it began to land at Heathrow Airport.

విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్.. తప్పిన పెను ప్రమాదం..

Posted: 04/18/2016 12:02 PM IST
Drone apparently crashes into plane headed to london s heathrow

బ్రిటీష్ ఎయిర్ వేస్కు చెందిన విమానం పెను ప్రమాదాన్ని తప్పించుకుని సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. లండన్ నుంచి యూరోప్లోనే చాలా రద్దీగా ఉండే విమానాశ్రయమైన హిత్రూ కు చేరుకుని ల్యాండింగ్ అయ్యే సమయంలో ఒక డ్రోన్ విమానం ముందుభాగాన్ని తాకింది. హిత్రూ విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు అధికారులు ఆదేశించారు.

దీంతో హీత్రూలో విమానం ల్యాండ్ కాగానే బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన ఫైలట్ విమానాశ్రయ అధికారులతో పాటు పోలీసులకు కూడా దీనిపై పిర్యాదు చేశారు. 137 మంది ప్రయాణికులు, విమానసిబ్బందితో ఎయిర్ బస్ ఏ320 విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో డ్రోన్, విమానాన్ని ఢీకొట్టినట్టు గమనించిన పైలెట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. విమానం జెనీవా నుంచి హిత్రూకు వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

విమానం సురక్షింతంగా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే సిబ్బంది తనిఖీ చేశారు. విమానానికి ఎలాంటి హాని జరగకపోవడంతో మరుసటి ప్రయాణానికి ఎయిర్ బస్ ఏ320 బయలుదేరింది.అయితే గడచిన మూడు నెలల్లో యూకేలోనే ఇలాంటివి 23 సంఘటనలు  చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. విమానాలు, ఢ్రోన్లను ఢీకొంటే కలిగే తీవ్రపరిణామాల గురించి తెలియని వారే ఎదో సరదా కోసం ఇలా చేస్తున్నారని బ్రిటీష్ పైలట్స్ అసోసియేషన్ అధికారి స్టీవ్ లాండెల్స్  తెలిపారు. విమానానికి దగ్గరగా డ్రోన్లను తీసుకురావడం చట్ట పరంగా నేరమని పేర్కొన్నారు.  

విమానాశ్రయ నిబంధనల ప్రకారం ఎయిర్ పోర్టు సమీపంలో ఎలాంటి డ్రోన్ లకు అనుమతులు వుండవని, అయినా డ్రోన్ లను ఇక్కడకు తీసుకురావడం నేరమని, ఇందుకు పాల్పడిన వాళ్లు కారాగారావాసం కూడా చేయాల్సివుంటుందని అధికారులు తెలిపారు. కాగా బ్రీటీష్ ఎయిర్ వేస్ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ విమానం పూర్తిగా సరక్షితంగా వుందని, ప్రయాణికులు ఎలాంటి అందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.  ప్రయాణికుల భద్రత, సురక్షత తమ ఎయిర్ లైన్స్ లక్ష్యమని చెప్పారు, ఈ నేపథ్యంలో తమ విమానం హిత్రూ నుంచి మళ్లీ లండన్ కు బయలుదేరిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heathrow  British Airways  Europe  Drone attack  

Other Articles