Strong quake in Japan kills at least nine

Strong quake in japan kills at least nine

Japan, earth Quake, Japan nuclear palnts

A strong earthquake hit southwestern Japan on Thursday, bringing down some buildings, killing at least nine people and injuring hundreds, local media said, but the nuclear regulator reported no problems at power plants.

జపాన్ ను మరోసారి వణికిస్తున్న భూకంపం

Posted: 04/16/2016 07:43 AM IST
Strong quake in japan kills at least nine

జపాన్-ను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. దీంతో జపనీయులు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో మరోసారి భూకంపం రావడంతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది. రిక్టర్ స్కేల్-పై భూకంప తీవ్రత 7.2 గా నమోదైంది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో చాలా చోట్ల రోడ్లు, ఇళ్ల గోడలు నిట్టనిలువునా చీలిపోయాయి. జపాన్ ప్రజలు రాత్రంతా భయాందోళనతో కాలం గడిపారు. భూకంపం ధాటికి జపాన్-లోని దక్షిణ కుమమొటో, మషికి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి.

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. జపాన్‌లోని నాలుగు ప్రధాన ద్వీపాల్లో ఒకటైన కుషు ద్వీపం మధ్యలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.5గా నమోదైంది. భూకంపం ధాటికి సుమారు 9 మంది మృత్యువాత పడ్డారు. 700 మందికి పైగా గాయపడినట్లు స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. నైరుతి జపాన్‌లోని కుమమోటో ప్రాంతంలో గురువారం రాత్రి 9.26 గంటల ప్రాంతంలో ఈ భారీ భూకంపం సంభవించింది. బాధితులను కనుగొనేందుకు శుక్రవారం సహాయక సిబ్బంది ఇంటింటికి తిరిగి తనిఖీ చేసింది. ఈ భూకంప తీవ్రత వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని, కానీ శుక్రవారం ఉదయం వరకు వందకు పైగా సార్లు భూప్రకనలు వచ్చాయని జపాన్ వాతావరణ సంస్థ తెలియజేసింది. భూకంపం వల్ల సుమారు 16వేల ఇళ్లల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు దెబ్బతిన్నాయి.

భూకంపం సంభవించిన ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ రాకపోకలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. ఓ ప్రెస్ కాన్పరెన్స్‌లో రక్షణ మంత్రి జెన్ నాకటాని మాట్లాడుతూ భూకంప ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు రక్షణ దళాన్ని పంపించామన్నారు. అయితే భూకంప తీవ్రత వల్ల ఆ ప్రాంతంలో ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. రానున్న రోజుల్లో సుమారు 6 తీవ్రతతో అధికసార్లు భూప్రకంపనలు సంభవించ వచ్చని ఆ సంస్థ వెల్లడించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భవనాలు, కొండచరియలు విరిగి పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సంస్థ ప్రతినిధి జెన్ ఓకి సూచించారు. 2011లో ఈశాన్య జపాన్‌లో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సునామీ వచ్చింది. ఈ విపత్తులో 16వేలకు పైగా మంది మృతి చెందారు. 2500 మందికి పైగా గల్లంతయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Japan  earth Quake  Japan nuclear palnts  

Other Articles