Pawan kalyans is he option or offer

Pawan kalyans is he option or offer

Janasena, Power Star, Pawan Kalyan, AP, Pawan Kalyan in AP, Pawan Kalyan political career, Janasena Party

Janasena party leader Power Star Pawan Kalyan may get bumper offer in ap. AP people got one more option as pawan kalyan in politics.

పవన్ కళ్యాణ్ ఆఫరా.? ఆప్షనా.?

Posted: 04/15/2016 03:56 PM IST
Pawan kalyans is he option or offer

తెలుగు సినిమా స్టార్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారుతున్నాడు. అందుకే 2019 ఎన్నికల్లో తన పార్టీ గుర్తుతో బరిలోకి దిగాలని ప్లాన్ వేస్తున్నారు. అందుకుగాను తన సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి... పొలిటికల్ కెరీర్ కు శ్రీకారం చుట్టనున్నారు. అందుకే తాను మరో రెండు మూడు సినిమాల తర్వాత శాశ్వతంగా సినీరంగం నుండి తప్పుకుంటున్నానని ముందే ప్రకటించేశారు. అయితే తాజాగా ఓ వార్త మాత్రం జనసేన పార్టీ వాళ్లకు, పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చింది.

ఇంతకీ అంతలా నచ్చిన విషయం ఏంటో తెలుసుకోవడానికి ముందు ఏపిలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి కూడా తెలుసుకోవాలి. ఏపిలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హవా నడుస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని చాలా బాగా నడిపిస్తున్నారు చంద్రబాబు. తన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని దెబ్బతియ్యడంలో భాగంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా వైసీపీని నిర్జీవం చేస్తున్నారు. కాగా వైసీపీ అధినేత జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో బాగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరకాటంలొ పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీలోకి వలసలను మాత్రం ఆపలేకపోయారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బరిలోకి నిలుస్తుంది..

ఏపిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా కేవలం తెలుగుదేశం, వైసీపీలు మాత్రమే బాగా ప్రాభల్యాన్ని చాటుతున్నాయి. కానీ తాజాగా ఓ సంస్థ ప్రకటించిన వివరాలు.. జనసేన అభిమానుల్లో, పవన్ కళ్యాణ్ కు మంచి కిక్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా కిక్ ఇచ్చే వార్త అనుకుంటున్నారా.? ప్రస్తుతం ఏపిలో ఉన్న పరిస్థితుల కారణంగా జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు అక్కడ ఓ ఛాన్స్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మీడియా స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ సర్వేలో జనసేనకు అనుకూలంగా వచ్చిన ఈ అంశం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

జనసైన్యంలో కొత్త జోష్.. విజయవాడ నుంచి పోటీ చేయాలంటున్న కార్యకర్తలు

జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీతప్పదని ముందే సంకేతాలిచ్చారు. జనసేన పార్టీకి తెలంగాణలో ఎన్నికల కమీషన్ ద్వారా గుర్తింపు వచ్చినా కానీ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దిగలేదు. కానీ ఏపిలో పవన్ కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్న తరుణంలో దాన్ని అందుపుచ్చుకుంటారా..? అనేది చూడాలి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు పవన్ తనకు వచ్చిన బంపర్ ఆఫర్ ను అందుకుంటారా లేదా అన్నది చూడాలి. మొత్తంగా ఏపి ప్రజలకు చంద్రబాబు, జగన్ లు కాకుండా పవన్ కళ్యాణ్ అనే మరో ఆప్షన్ కూడా ఉంది అన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.

-Abhinavachary

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Janasena  Pawan Kalyan  AP  Pawan Kalyan in AP  political career  Janasena Party  

Other Articles