AP People supports CM Chandrababu Naidu

Ap people supports cm chandrababu naidu

AP, Chandrababu Naidu, Ap People, Andhra Pradesh

Newly seperated state AP facing many problems. But AP People belives in Chandrababu Naidu.

బాబుకు జై అంటున్న ఆంధ్రా జనం

Posted: 04/15/2016 01:38 PM IST
Ap people supports cm chandrababu naidu

రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పని తీరుపై జనం ఏమనుకుంటున్నారు. చంద్రబాబు నాయకత్వంపై జనం ఏమనుకుంటున్నారు అన్న దానిపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)  సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించిన సర్వే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.అయితే చంద్రబాబుకు అనుకూలంగా ఫలితాలు వెల్లువడినప్పటికీ ఆయన పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? అంటే మాత్రం జనం లేదనే అంటున్నారు. చంద్రబాబు కష్టపడుతున్నారని, కానీ ఆ ఫలితాలు మాత్రం ప్రజలకు అందడం లేదన్న భావన ఈ సర్వే లో తేలింది. చంద్రబాబు స్థాయిలో ఆయన కేబినెట్ లోని మంత్రులు పని చేయడం లేదని తేలింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

సర్వే లో తేలిన విషయాలు:

* ఏపీ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతో తప్ప మరో వ్యక్తీ సాధ్యం కాదని 67% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
* బాబు నాయకత్వంలో రాష్ట్రంలో మతసామరస్యం చక్కగా వుందని 61% మంది తెలిపారు.
* రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని 54% మంది
* సుదీర్ఘ కాలంలో కానీ ఎటువంటి ప్రాంతీయ ఉద్యమాలు రావని 62% మంది పేర్కొన్నారు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu Naidu  Ap People  

Other Articles