Here's how India plans to completely 'lock' the border with Pakistan

Govt plans 5 layer lock at border to prevent pathankot like attacks

indo-pak border, CIBMS, tech-savvy strategy, India, Pakistan, Indian Army, infiltration, Pathankot terror attack, BSF, Jammu And Kashmir, gujarat, check to infiltration, nefarious terror attacks

India's western border has often been susceptible to nefarious terror attacks and a tech-savvy strategy has been worked out to check the problem.

పాక్ ఉద్రవాద చొరబాట్లకు త్వరలో చెక్, టెక్నాలజీని వినియోగించనున్న భారత్..

Posted: 04/11/2016 03:55 PM IST
Govt plans 5 layer lock at border to prevent pathankot like attacks

ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్థాన్.. తమ దేశంలో వాటిని పెంచిపోషిస్తుందన్న అరోఫణలు వున్నాయి, అనేక పర్యాయాలు ఉగ్రవాద సంస్థల ఘాతుకాలకు పాల్పడి తమ దేశ పౌరుల జీవితాలను కూడా బలి తీసుకున్నా.. పాక్ మాత్రం వాటి జోలికి వెళ్లకుండా వాటిని అక్రమంగా పెంచిపోషిస్తునే వుంది, అంతేకాదు అక్కడ శిక్షణ పోందిన ఉగ్రవాదులను భారత్ లోకి అక్రమంగా చోరబడి అలజడులు సృష్టించాలని వారి తర్పీదునిస్తుంది, అయితే ఇకపై వారి ఆటలు సాగనీయకుండా భారత్ కొత్త పహరాకు శ్రీకారం చుట్టనుంది.

భారత్ పాక్ సరిహద్దుల గుండా చొరబడుతూ, ఉగ్రదాడులకు పాల్పడుతున్న వారిని అరికట్టడమే లక్ష్యంగా ఆధునిక టెక్నాలజీని నమ్ముకోవాలని భారత్ భావిస్తోంది. ఈ ప్లాన్ విజయవంతమైతే ఒక్కడు కూడా పాక్ వైపు నుంచి ఇండియాలోకి రాలేడని, ఇందులో భాగంగా 2,900 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దులను పరిరక్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. సరిహద్దులపై నిఘా ఉంచేందుకు ఐదంచెల వ్యవస్థను 'సీఐబీఎంఎస్' (కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్ మెంట్ సిస్టమ్)ను ఏర్పాటు చేయడం ద్వారా అనుక్షణం సరిహద్దులను కాపాడవచ్చని భద్రతాదళాలు, రక్షణ శాఖ అధికారులు కొత్త ప్రణాళిక అమలుకు కదిలారు.

సరిహద్దుల వెంట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్, నైట్ విజన్ పరికరాలు, రాడార్లు, లేజర్ కిరణాలతో కూడిన అడ్డుగోడలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు ఓ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఏర్పాట్లు పూర్తయితే, చొరబాటుకు యత్నించినప్పుడల్లా క్షణాల్లో సమాచారం అందుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం భారత్, పాక్ సరిహద్దుల్లోని పర్వతాలు, నదుల పరిసరాల్లో 130 చోట్ల ఫెన్సింగ్ లేని ప్రాంతాలున్నాయి. వీటిని అలుసుగా తీసుకుంటున్న ఉగ్రవాదులు సులువుగా భారత్ లోకి చొరబడుతున్నారు. కాగా నూతన టెక్నాలజీ అందుబాటులోకి రాగానే ఇక అక్రమ చోరబాట్లకు చరమగీతం పాడినట్లేనని వార్తలు అందుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  Indian Army  infiltration  Pathankot terror attack  BSF  Jammu And Kashmir  

Other Articles