No ban on fireworks in temple festivals: Devaswom Board

Kerala temple fire police detain five people as death toll mounts to 112

Puttingal temple fire accident, kerala temple fire accident, Kollam district, Kerala DGP TP Senkumar, two firework contractors, Paravur festival, Temple Trustee, travancore devaswom board, Kollam temple fire, fireworks ban, Puttingal Devi temple, Kerala tradition, festivals in Kerala,Kerala ,Kollam ,disaster and accident

Five people have been detained in connection with the deadly inferno at the Puttingal temple in Kollam district in Kerala.

112కు చేరిన మృతుల సంఖ్య, బాణాసంచాను నిషేధించలేమంటున్న ఆలయకమిటీ

Posted: 04/11/2016 02:13 PM IST
Kerala temple fire police detain five people as death toll mounts to 112

కేరళలోని పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 112కు చేరింది. బాణాసంచా పేలుడు సమయంలో అగ్నికీలలు బాణాసంచాపైకి ఎగసిపడటంతో అదివారం తెల్లవారుజామున ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది, క్రితం రోజు  రాత్రి పొద్దుపోయే సమయానికి 106 మంది ఈ ఘటనలో అసువులు బాయగా, ఇవాళ తెల్లవారేసరికి ఆ సంఖ్య 112కు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ 300 మందికి పైగా క్షతగాత్రుల్లో ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగానే ఉంది.

క్షతగాత్రులను తొలుత కొల్లం పరిధిలోని ఆసుపత్రులకు తరలించిన సహాయక సిబ్బంది... పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎయిర్ అంబులెన్స్ ల ద్వారా తిరువనంతపురానికి తరలించారు. ఇదిలా ఉంటే, ఈ ప్రమాదాన్ని సీరియస్ గా పరిగణించిన కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పుట్టంగల్ ఆలయంలో మారణహోమానికి కారణమైనవారిలో ఐదుగురిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. బాణసంచా పేలుడుతో సంబంధమున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కేరళ డీజీపీ తెలిపారు.

మరోవైపు పుట్టంగల్ ఆలయంలో పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని పోలీసు అధికారుల బృందం ఈ ఉదయం పరిశీలించింది. భారీ పేలుడుకు దారితీసిన కారణాలను అన్వేషించింది. ఈ విషాదఘటన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిన్న మధ్యాహ్నం వైద్యుల బృందాలను వెంటబెట్టుకుని ఘటనాస్థలానికి వచ్చి, క్షతగాత్రులను పరామర్శించారు, అయితే ఇవాళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు.

ఇదిలావుండగా, కేరళలోని దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్న వేళ, బాణసంచా కాల్చడం సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైపోయిందని, బాణసంచాను నిషేధించలేమని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. నిన్న కొల్లంలోని పుట్టింగళ్ దేవి ఆలయంలో భారీ ఎత్తున బాణసంచా అంటుకుని 112 మంది మరణించిన ఘోర దుర్ఘటన అనంతరం, బోర్డు అధ్యక్షుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్ట్ చేశారు.

దుర్ఘటన వెనుక పోలీసుల వైఫల్యం లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితల తెలియజేశారు. పోలీసులు బాణసంచా ప్రదర్శనను ఎందుకు ఆపలేదని ప్రశ్నించగా, 'లక్షలాది మంది గుమికూడి ఉన్న ప్రాంతంలో, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పోలీసులు చర్యలు తీసుకుంటే, మరో సమస్య ఉత్పన్నమవుతుంది. అన్ని విధాలుగా పరిస్థితిని పరిశీలించాల్సి వుంటుంది కదా?' అని అన్నారు. కాగా, నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొల్లాంను సందర్శించనున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles