robbers strike Nampally bound Nanded Express

Robbery in nanded express in khammam

Robbery in Nanded Express, Nanded Express, Narayanadri Express, denduluru, madira mandal, gold ornaments, khammam district, rpf police firing, Robbery Attempt in Narayanadri Express,

Robbers stuck two coaches of Nanded Express near denduluru of madira mandal in Khammamdistrict in the early hours.

తెలంగాణలోకి తెగబడ్డ దొంగలు.. నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో చోరీ..

Posted: 04/11/2016 10:52 AM IST
Robbery in nanded express in khammam

రైలు ప్రయాణాలంటే వణుకు పుట్టించే పరిస్థితుల నుంచి సుఖవంతమైన ప్రయాణాలుగా క్రమంగా మారుతూ ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా మారింది. సుదూర ప్రయాణాలకు పేద, బడుగు వర్గాలకు సౌకర్యవంతమైన, అనువైనదిగా మారడంతో రోజురోజుకీ దేశ ప్రజల ఆదరణ పెంచుకుని  ముందుకు పోతుంది, ప్రతీ రైలులోనూ రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, రైల్వే పోలీసులు పహారా కాస్తూ.. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాలుగా మారుస్తుంది.

అయితే గత కొంత కాలంగా మళ్లీ రైళ్లలో దోపిడీ దోంగలు విభృభిస్తున్నారు. ఇటీవల ఓ ఐపీఎస్ అధికారిపైనే దాడికి పాల్పడి అమె వస్తువులను తస్కరించిన దొంగలు.. ఆ తరువాత అనేక రైళ్లోలో ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. మొన్న ప్రకాశం జిల్లా, నిన్న కడప జిల్లా... ఆ తరువాత చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. రైలు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్దకు రాగానే గుర్తుతెలియని దుండగులు చైన్ లాగి రైలును నిలిపి వేసి దోపిడీకి యత్నించారు. వీరిపై రైల్వే పోలీసులు ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపారు,

దీంతో ఇక రైళ్లలో దోంగల అలజడి తగ్గుతుందని భావించిన  పోలీసులకు మరో సవాల్ విసిరారు, ఆంద్రప్రదేశ్ కు బదులు ఇటు మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో హల్ చల్ చేశారు, ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు పరిధిలో నేటి తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది. అప్పటికే రైల్లోకి ఎక్కిన దొంగలు దెందుకూరు వద్దకు రాగానే చైన్ లాగి రైలును ఆపేసిన దొంగలు ఇద్దరు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాగేశారు. ఆ తర్వాత వెనువెంటనే రైలు దిగేసి, క్షణాల్లో మాయమయ్యారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles