106 dead in Puttingal temple fire, Kerala government orders probe

Massive fire kills over 106 at puttingal temple fire in kerala

accident, Blast, Massive fire, Paravoor temple, Puttingal temple fire, pm modi, protocols, kerala, Chief Minister Oommen Chandy, ex gratia, Rs 10 lakh, explosion, Fire, Fireworks, India, Kerala, Kerala CM, Kollam, Mishap, Oommen Chandy, Puttingal Devi temple, thiruvananthapuram Medical College, Paravoor, Kollam district, Massive fire, Paravoor temple,

The country was today left shocked and saddened as it woke up to the massive temple tragedy in Kerala

ప్రమాదస్థలిలో ప్రధాని మోడీ, క్షతగాత్రులకు పరామర్శ

Posted: 04/10/2016 08:52 PM IST
Massive fire kills over 106 at puttingal temple fire in kerala

రళలోని మహా విషాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. రాష్ట్రంలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 106కు చేరింది. 250 మందికి పైగా తీవ్రగాయాలయినట్టు సమాచారం. ఈ విషాధంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ.రెండులక్షల సాయాన్ని ప్రకటించారు.

అటు ప్రమాధఘటనాస్థలి పుట్టింగళ్ దేవీ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. కొల్లంలో మోదీకి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్వాగతం పలికారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను మోదీకి వివరించారు. అగ్నిప్రమాద బాధితులను, వారి కుటుంబాలను మోదీ పరామర్శించారు. కాలిన గాయాలకు చికిత్స అందించడానికి నైపుణ్యం ఉన్న డాక్టర్ల బృందాన్ని మోదీ తనతో పాటుగా కేరళకు వచ్చారు. తిరువనంతపురం విమానాశ్రయంలో ఆయనకు కేరళ గవర్నర్ పి సదాశివం, కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లో కొల్లాంకు చేరుకున్నారు

కొల్లాంలో మోదీకి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్వాగతం పలికారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను మోదీకి వివరించారు. మోదీ, చాందీ, కేంద్ర మంత్రి జేపీ నద్దా కలసి.. కొల్లాంలోని ఏఏ రహీం స్మారక ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపిన ప్రధాని.. కేరళలో తాను పర్యటిస్తున్న సమయంలో ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని ముందుగానే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేరళ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయసహకారాలు అందించాల్సిందిగా కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ సిన్హాను ఆదేశించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles