IPL vs drought? Fans give split verdict

Study reveals tea without sugar could save more water than ipl ban in drought hit maharashtra

Water, Sugarcane, irrigation, IPL, Indian Premier League, water conservation, water crisis, Marathwada, infrastructure

Mumbai can save 150% more water by drinking tea without sugar for a day than can be saved by banning a season of Indian Premier League (IPL)—India’s professional cricket tournament

టీలకే అధిక నీరు.. మోకాలికి బోడిగుండుకి లెంకపెట్టిన మేధావులు..

Posted: 04/10/2016 09:26 AM IST
Study reveals tea without sugar could save more water than ipl ban in drought hit maharashtra

నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో నీటి ఎద్దడి తీరాలంటే ఏం చేయాలన్న విషయమై సాగుతున్న రసవత్తర చర్చలో భాగంగా మోకాలికి బోడిగుండుకు లింకుపెడుతున్నారు మేధావులు. ఐపీఎల్ మ్యాచ్ ల ద్వారా లక్షల లీటర్ల నీరు వృధాగా పోతుందన్న ప్రజల అంధోళనను పరిగణలోకి తీసుకున్నారో లేదో కాని.. ఇప్పటికీ ఈ విషయమై సమావేశమైన బిసిసిఐ పెద్దలు మ్యాచ్ ల రద్దుతో సుమారుగా 100 కోట్ల రూపాయాల మేర నష్టం వాటిల్లుతుందని, ఈ నేపథ్యంలో మ్యచ్ లు కావాలా లేక రాష్ట్రానికి ఆదాయం కావాలా..? అన్న ప్రశ్నలను ప్రజలకే వదిలేసింది,

ఇదిలావుండగా, రాష్ట్రంలోని ప్రజలంతా చక్కెర లేకుండా టీ తాగినట్టయితే రోజుకు కోటిన్నర లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. రాష్ట్రంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ముంబై, పుణె, నాగపూర్ స్టేడియం పిచ్‌లకయ్యే నీటి ఖర్చుకన్నా చక్కెర లేకుండా ప్రజలు టీ తాగడం వల్ల 150 శాతం ఎక్కువ నీరు ఆదా అవుతుంది. నీటిని ఆదా చేసేందుకు ఐపీఎల్ మ్యాచ్‌లను రాష్ట్రంలో రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని బాంబే హైకోర్టు ఇటీవల బీసీసీఐకి సూచించిన విషయం తెల్సిందే. కోర్టు కూడా మ్యాచ్‌ల నిర్వహణపై ఎలాంటి స్టేను విధించక పోవడంతో ముంబై వాంఖేడ్ స్టేడియంలో ఇప్పటికే తొలి మ్యాచ్ జరిగి పోయింది.

ముంబై, పుణె, నాగపూర్ స్టేడియంలలో 20 మ్యాచ్‌ల నిర్వహణకు 60 లక్షల లీటర్ల నీరు ఖర్చవుతుందని లోక్‌సత్తా మూవ్‌మెంట్ తరఫున పిటిషనర్ కోర్టులో వెల్లడించారు. అయితే నేషనల్ జియోగ్రఫీ లెక్కల ప్రకారం ఓ కిలో చక్కెరను ఉత్పత్తి చేయడానికి 1500 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. ముంబైలోని 20 శాతం లేదా 25 లక్షల మంది ప్రజలు రోజుకు ఓ టీ స్పూన్ చెక్కరేసుకొని టీ తాగుతారనుకుంటే దాదాపు పదివేల కిలోల చక్కెర ఖర్చవుతుంది. అంటే దానికి రోజుకు కోటిన్నర లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలోని మూడు ఐపీఎల్ వేదికల్లో ఉపయోగించే నీటికన్నా రెండున్నర రెట్లు ఎక్కువ. ఇలాగే కాఫీలు, కోల్డ్ కాఫీలు, పాలు, కూల్ డ్రింకులు, హాల్కాహాలు లాంటివి లెక్కేసుకుంటే పోతే కోటానుకోట్ల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు.
 
ఇలా పోల్చుకుంటూ పోతే.. ఒక్క రోజు బాగోతానికి మూతి మీసం తీసుకున్నట్లు అన్న చందంగా.. ఐపీఎల్ మ్యాచ్ లో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ఉత్పత్తులను నిలిపివేయాలని సూచనలు తెరపైకి రావడంతో ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇలానే పరిస్థతులు ముందుకు వెళ్తే రానురాను చెరుకు, వరి, సహా పలు పంటలను అపేసి ప్రజలను పస్తులకు కూడా ఉరిగోల్పే పరిస్థితులు వస్తాయంటున్నారు రైతుపక్ష మేధావులు, అసలు రైతు రాజ్యమైన భారత దేశంలో రైతు సంక్షేమాన్ని కాంక్షించేవారే కరువయ్యారని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలే కరువు పరిస్థితులు ఎదుర్కోంటున్న తరుణంలో వున్న నీటని కనీసం సాగుకు సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలు అలోచిస్తుండగా, వాటిని తోసి రాజుతూ ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణే ముఖ్యమన్నట్లు మేధావులు మాట్లాడటం, పైగా ఫలానా పంటలను వేయవద్దని, టీ, కాఫీలు తాగవద్దని ప్రజలకు సూచించడం ఎంతవరకు సమంజసమని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక వినోదం కోసం జరిగే మ్యాచ్ ఆదాయాన్ని కూడా ఆర్జిసు్తన్నాయని, చెబుతున్న మేధావి వర్గానికి వినోదానికి పంట ఉత్పత్తికి లెంకె పెట్టడం ఎంత సముచితం అంటూ నిలదీస్తున్నారు రైతు సంఘాల నేతలు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : water  ipl pitches  maharastra  Sugarcane  irrigation  

Other Articles