86 dead in Puttingal temple fire, Kerala government orders probe

Massive fire ills over 86 at puttingal temple fire in kerala

accident, Blast, BreakingNow, explosion, Fire, Fireworks, India, Kerala, Kerala CM, Kollam, Mishap, Oommen Chandy, Puttingal Devi temple, hiruvananthapuram Medical College, Paravoor, Kollam district, Massive fire, Paravoor temple,

The explosion was caused when the storehouse of the fireworks materials caught fire. Many of the injured died before they could reach a hospital.

కేరళలో మహావిషాదం.. పుట్టింగళ్ దేవీ ఆలయంలో ప్రమాదం.. 86 మంది మృతి

Posted: 04/10/2016 08:48 AM IST
Massive fire ills over 86 at puttingal temple fire in kerala

కేరళలోని మహా విషాదం సంభవించింది, రాష్ట్రంలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 86 మందికిపైగా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. 150 మందికి పైగా తీవ్రగాయాలయినట్టు సమాచారం. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో.. అవి భక్తుల పాలిట మృత్యు కీలలుగా మారడంతో.. కకోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు మృత్యువాత పడడంతో విషాదం నెలకొంది.

వీరిని తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆక్రందనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. బాణాసంచా పేలుడు సందర్భంగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగిసిపడడంతో శరవేగంగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. మంటలు భారీగా వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

భారీగా మంటలు, పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భక్తులు విలవిల్లాడారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునే బాణాసంచా పేలుడు పదుల సంఖ్యలో భక్తుల మృతికి కారణమవడం గమనార్హం. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను కొల్లం, తిరువనంతపురం ఆస్పత్రులకు తరలించారు. కేరళ సీఎం ఉమెన్ చాందీ, మంత్రులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles