transgenders slam actress turned politician kushboo in chennai

Would have beheaded lakhs over bharat mata ki jai says baba ramdev

bharat mata ki jai, devendra fadnavis, maharashtra chief minister, bjp, bharat mata ki jai row, bharat mata ki jai controversy, fadnavis bharat mata ki jai remarks, fadnavis bharat mata ki jai comments, mumbai news, india news

Adding fire to the raging “Bharat Mata Ki Jai” controversy, yoga guru Ramdev has said that but for the rule of law he would have “beheaded” lakhs of people for refusing to chant the slogan.

బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..నినాదంపై కొనసాగుతున్న వివాదం..

Posted: 04/05/2016 03:01 PM IST
Would have beheaded lakhs over bharat mata ki jai says baba ramdev

‘భారత్ మాతా కీ జై’ నినాదంపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని, ఈ నినాదాన్ని ఎవరితోనూ బలవంతంగా చెప్పించాల్సిన అవసరం లేదంటూ ఆరెస్సెస్ ఛీప్ మోహన్ భగవత్ తేల్చిచెప్పినా.. ఈ నినాదం విషయంలో వివాదం రోజురోజుకు మరింతగా వివాదాస్పదం అవుతోంది. తాజాగా,  ఐంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ లక్ష్యంగా యోగా గురు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఒకతను టోపీ పెట్టుకుని వస్తాడు. తన గొంతు కోసినా భారత్ మాతా కీ జై అని నినదించనంటాడని దుయ్యబట్టారు.

ఈ దేశంలో చట్టం ఉంది. లేదంటే నీ ఒక్కడిదేంటి.. మేం లక్షలాది తలలు తెగ్గోయగలంమంటూ హెచ్చరించారు. చట్టం, రాజ్యాంగంపై గౌరవం ఉంది కాబట్టి కానీ.. లేదంటే భారతమాతను ఎవరైనా అవమానిస్తే.. లక్షల తలలు నరికే సామర్ధ్యం మనకుంది’ అంటూ రామ్‌దేవ్ తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహతక్‌లో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన సద్భావన సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్‌దేవ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.

కాగా రాందేవ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలన్నీ మండిపడుతున్నాయి. రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికారప్రతినిధి సంజయ్ ఝా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు, ప్రజలు పడుతున్న సమస్యల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ అని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి విమర్శించారు. భారత్ మాతాకీ జై అనడం ద్వారా మాతృభూమిపై గౌరవాన్ని, దేశభక్తిని అంగీకరించినట్లు అవుతుందని రామ్‌దేవ్ చెప్పారు. ఏ మతమైనా ఆ నినాదాన్ని వ్యతిరేకిస్తే అది జాతి హితాన్ని వ్యతిరేకించినట్లేనన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Mata Ki Jai  controversy  Asaduddin OWAISI  Baba Ramdev  Fadnavis  

Other Articles