Honour killing: Mandya man kills daughter for falling in love with Dalit boy

Honour killing in mandya teen killed for having affair with dalit

Monica, Mandya, honour killing, India, Karnataka, family, dalit, boy, Mandya killing, girl killed by family karnataka, Mandya Taluk, Bangalore, India, crime against woman, Gowda community

Mandya police have said that the death of a caste-Hindu girl, who was in love with a Dalit boy, is suspected to be a case of honour killing by the girl’s family.

దళిత కుర్రోడిని పరిణయమాడిందని కన్న కూతురినే..

Posted: 04/05/2016 03:42 PM IST
Honour killing in mandya teen killed for having affair with dalit

దళితులు అంటే మనుషులు కాదా..? అసలు మనుషి అనే వాడికి జన్మనిచ్చిన మూలస్థంబాలను అన్వేషించుకుంటూ పోతే.. మనుష జాతీకి తల్లిదండ్రులనే వారు ఒక్కరే వుంటారు, లేదా వారి అన్నదమ్ముల పిల్లలే అవుతారు. చేతివృత్తుల అధారంగా కులాల విభజన (డివిజన్ అఫ్ లేబర్) అత్యంత ప్రామాణికంగా తీసుకుని ఫలానా వాళ్లు దళితులు, ఫలానా వాళ్లు అగ్రవర్ణాల వాళ్లు అంటూ స్వాత్రంత్యం వచ్చిన రమారమి 70 ఏళ్లకు కూడా విభజించుకుంటూ పోతున్నామంటే మనుషులంతా ఒక్కటే అని చాటేందుకు ఇంకా ఎన్ని వందల ఏళ్లు పోరాడాల్సి వస్తుందోనన్న అందోళన కలుగుతుంది.

తమిళనాడులో నట్టనడి రోడ్డులో అందరూ చూస్తుండగా, బెక్ పై వచ్చిన అగంతకలు దళిత యువకుడిని హత్య చేసి, అతని భార్యపై కూడా దాడి చేసి పరువు హత్యలకు పాల్పడిన ఘటనను ఇంకా దేశప్రజలు మర్చిపోకమునుపే.. పోరుగు రాష్ట్రం కర్నాటకలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది, దళితుడిని పరిణయం చేసుకుందని కన్నకూతర్నే కడతేర్చారు కుటుంబసభభ్యులు. 19 ఏళ్ల అమ్మాయిని సొంత కుటుంబసభ్యులే యమభటులుగా మారి అత్యంత కిరాతకంగా అమెను హతమార్చారు.

కర్ణాటక మాండ్యా జిల్లాలో శనివారం రాత్రి 19 ఏళ్ల మౌనిక పంటపొలాల్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఈ వ్యవహారం పోలీసులకు తెలియకూడదనే ఉద్దేశంతో ఆదివారం ఉదయమే గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు. మోనిక కొన్నిరోజుల కిందట తనను ప్రేమించిన దళిత యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆమెను భయపెట్టి ఆత్మహత్య లేఖ రాయించారని, ఆ తర్వాత బలవంతంగా ఆమెకు ఉరివేసి చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రిని, అంకుల్‌ని పోలీసులు అరెస్టు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honour killing  karnataka  Mandya  Monika  dalit  

Other Articles