Cigarette companies stop production

Cigarette companies stop production

Cigarette, Cigarette Company, Cigarette Production, ITC

Tobacco product manufacturers in India on Friday decided to shut down factories with immediate effect citing 'ambuguity' in pictorial warning policy. This included top manufacturers such as ITC Ltd, part-owned by British American Tobacco, Godfrey Philips and VST which suspended production on Friday over what they said was ambiguity in the government's new health warning rules for packs, a leading industry body said.

సిగరెట్ తయారీ బంద్

Posted: 04/04/2016 06:44 AM IST
Cigarette companies stop production

పొగరాయుళ్లకు ఇది చేదువార్తనే చెప్పాలి… ఎందుకంటే దేశంలో ఉత్పత్తవుతున్న దాదాపు 98 శాతం సిగరెట్ల తయారీదారులైన ఐటిసి, గాడ్ ఫే పిలిప్స్, విఎస్‌టి సంస్థలు ఇకపై వీటి ఉత్పత్తిని నిలివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ, సిగరెట్ తయారీదారు సంస్థలపై విధించిన ఆంక్షలే దీనికి కారణమని సమాచారం. ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం సిగరెట్ ప్యాకెట్‌పై 85 శాతం భాగం సిగరెట్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా బొమ్మకు కేటాయించాల్సి ఉంటుంది. దీనివల్ల తీవ్ర నష్టం వస్తుందని, నిబంధనలు పాటించడం కూడా సాధ్యపడదని సిగరెట్ తయారీ సంస్థలు వాపోతున్నాయి.

దీనికన్నా పరిశ్రమలను మూసివేయడం మేలంటున్నాయి. దీనిలో భాగంగానే సిగరెట్ ఉత్పత్తిని పూర్తిగా నిలపివేయాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీడి పరిశ్రమకు సంబంధించి పుర్రె గుర్తు సైజ్ తగ్గించాలనే డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సిగరెట్ కంపెనీలకు ఈ ఆదేశాలు రావడంతో కొత్త సమస్యకు తెరలేపినట్లయింది. కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ హైకోర్టు వెలువరిచిన తీర్పుమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పై ఆదేశాలను జారీ చేసిందని సిగరెట్ తయారీదారు సంస్థలు పేర్కొన్నాయి. పొగత్రాగడం ప్రమాదకరమే కానీ కోట్ల మంది ఈ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నారు. దీంతో కేంద్రం ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cigarette  Cigarette Company  Cigarette Production  ITC  

Other Articles