Those who can't say 'Bharat mata ki jai' should leave India, says Devendra Fadnavis

Those who can t say bharat mata ki jai should leave india says devendra fadnavis

Devendra Fadnavis, Bharat Mata ki Jai, Maharastra, Muslims

Joining the ongoing debate on nationalism, which is being linked to chanting of certain slogans in recent times, Maharashtra Chief Minister Devendra Fadnavis on Sunday said that those having reservations to chant ‘Bharat Mata ki Jai’ shouldn’t live in this country.

భారత్‌మాతాకీ జై అనకుంటే దేశంలో ఉండొద్దు

Posted: 04/04/2016 08:35 AM IST
Those who can t say bharat mata ki jai should leave india says devendra fadnavis

భారత్ మాతాకీ జై అని అనాలా వద్దా..? అనే అంశంపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. తాజాగా మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యల మీద సర్వత్రా చర్చ సాగుతోంది. భారత్‌మాతాకీ జై అనే నినాదం చేయడం ఇష్టంలేనివారికి దేశంలో నివసించే అర్హత లేదని నాసిక్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో అన్నారు. విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలుపొచ్చు, కానీ భారత్‌మాతాకీ జై నినాదాన్ని వ్యతిరేకించొద్దన్నారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసినవారికి మద్దతు పలికిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌పై విమర్శలుచేశారు. ఈ నినాదాన్ని వ్యతిరేకించేవారిని భారతీయులు సహించరని హెచ్చరించారు.

భారత్ మాతాకీ జై అని బారత్ లో కాకుండా ఎక్కడ అంటారు అని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశ్నించారు. బారత్ లో ఉంటూ భారత్ మాతాకీ జై అని అనకుండా పాకిస్థాన్ కు జై అంటారా..? లేదంటే చైనాకు అంటారా..? అని ఫడ్నవిస్ నిలదీశారు . మరోపక్క ముస్లింలు భారత్‌మాతాకీ జై అని నినదించొద్దని దేశంలోని అతిపెద్ద ఇస్లామిక్ సెమినరి దారుల్ ఉలూం దేవ్‌బంద్ ఫత్వా జారీచేసిన మరుసటి రోజే ఫడ్నవిస్ ఈ వ్యాఖ్యలుచేశారు. మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పీసీ చాకో ఘాటుగా స్పందించారు. భారత ప్రజాస్వామ్య ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇతరులను ఆదేశించలేరన్నారు. ప్రతి పౌరుడికి భావప్రకటనాస్వేచ్ఛ ఉన్నదని, ఈ విషయన్ని పౌరుల విచక్షణకే వదిలేయాలన్నారు. ఒకవేళ నిరంకుశ విధానాలు అవలంబించాలని భావిస్తే అది వారికే బెడిసికొడుతుందని ఆరెస్సెస్, బీజేపీలను హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devendra Fadnavis  Bharat Mata ki Jai  Maharastra  Muslims  

Other Articles