Hilarious moment street performer is left red-faced in china

Cheeky monkey leaves man red faced by pulling his trousers down

Hilarious, moment, street, performer, left, red-faced, naughty, animals, pulls, down, trousers china, hysterical video, viral video, enbarrassing movemenr, lupyang, central china, funny footage, China's Henan province

Hilarious moment street performer is left red-faced after one of his naughty monkeys pulls down his trousers

కోతుల చేష్టలు.. నట్టనడి వీదులో పరువు తీసిన మర్కటాలు

Posted: 04/03/2016 08:41 PM IST
Cheeky monkey leaves man red faced by pulling his trousers down

ఓరేయ్ కోతి చేష్టలు చేశావో.. ఒళ్లు వాచిపోద్ది అంటూ పెద్దవాళ్లు పిల్లలను తిట్టడం మామూలే. కానీ నిజంగా కోతులాండించే వాడినే కోతులు అడిస్తే.. నట్టనడివీధిలో అతని పరువు తీస్తే.. సరిగ్గా ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది. తన ముదురుకోతుల చేతిలో పరాభవం ఎదురుకావడంతో.. బిక్కముఖం వేయడం మాత్రమే అతని వంతైంది. చైనాలో కూడా ఇలాగే ఓ కోతులు ఆడించే వ్యక్తి ప్రజల్ని వినోదపరచడానికి ప్రయత్నించాడు. తన కోతిమూకతో బజారులో ప్రదర్శన పెట్టాడు.

అయితే అతనివి మామూలు కోతులు కాదు.. మహా ముదుర్లు. వాటిని ఆడించే క్రమంలో ఓ కోతి అతని జుట్టు పట్టుకొని పీకగా.. మరో కోతి వెనుక నుంచి వచ్చి అతని ప్యాంటును కిందకు లాగేసింది. అంతే అర్ధనగ్నంగా మారిన అతన్ని చూసి.. ప్రజలంతా నవ్వుల్లో మునిగిపోయారు. అయినా ఏమాత్రం చెదరకుండా తన ప్యాంటును తిరిగి పైకి లాక్కొని.. మర్కటాలతో విన్యాసాలు చేయించి భేష్ అనిపించుకున్నాడు ఆ సర్కస్ మనిషి. సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని లౌయంగ్‌ పట్టణంలో గత నెల 15న ఈ ఘటన జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.

చైనాలో ఇటీవలికాలంలో జంతువుల వినియోగం బాగా పెరిగింది. కోతులకు శిక్షణ ఇచ్చి వాటిద్వారా చెట్లపైన ఉన్న పక్షుల గూళ్లను తొలగించే కార్యక్రమాన్ని అక్కడి అటవీశాఖ చేపట్టింది. విమాన రాకపోకలకు అంతరాయ కలుగకుండా ఇలా కోతుల సేవలను వినియోగించుకుంటోంది. అలాగే హెనాన్ ప్రావిన్స్‌లో పర్యాటకులను బాగా ఆకట్టుకునేందుకు కోతులు విన్యాసాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.  

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : monkey  Hilarious moment  viral video  central china  

Other Articles