West Indies beat Australia to lift Women's World T20 trophy

West indies women gun down 149 for maiden wt20 title

2016 T20 World Cup, Australia women, cricket, t20 world cup 2016, West Indies women, womens world T20

In a historic first, the West Indies women's cricket team ended three-time defending champions Australia's domination by winning the ICC World T20 title

ITEMVIDEOS: అసీస్ ను చిత్తుచేసి టైటిల్ వశం చేసుకున్న విండీస్

Posted: 04/03/2016 08:45 PM IST
West indies women gun down 149 for maiden wt20 title

టీ 20 మహిళల ప్రపంచకప్ ను వెస్టిండీస్ వశం చేసుకుంది. అసీస్ జట్టుకు బయపడేది లేదని ముందుగానే తేల్చిన చెప్పిన విండీస్ కెప్టెన్..ఇవాళ ఈడెన్ గార్డెన్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో విండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి కప్ ను దక్కించుకుంది. ఆసీస్ విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన విండీస్ టైటిల్ ను సగర్వంగా అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఆసీస్ ఆధిపత్యానికి గండికొట్టిన విండీస్  వరల్డ్ కప్ ను ఎగురేసుకుపోయింది.

గతంలో వరుసగా మూడు పర్యాయాలు టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియా జట్టును ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఖంగుతినింపించి నాల్గోసారి వరల్డ్ కప్ను సాధించాలనుకున్న ఆసీస్ ఆశలు అడియాశలయ్యాయి.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుని నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు నమోదు చేసింది. ఆస్ట్రేలియా మహిళల్లో విలానీ(52), కెప్టెన్ లానింగ్(52)లు రాణించగా, పెర్రీ(28) ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. హైలే మాథ్యూస్(66;45 బంతుల్లో 6 ఫోర్లు, 3 ఫోర్లు) చెలరేగగా,స్టాఫానీ టేలర్(59; 57 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడింది. ఈ జోడి తొలి వికెట్ కు 120 భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విండీస్ విజయం లాంఛనమైంది. ఇక చివర్లో డోటిన్(18 నాటౌట్), కూపర్(3 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో విండీస్ ఇంకా మూడు బంతులుండగానే విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles